మహమ్మద్ సిరాజ్ కోసమే న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో అర్ష్‌దీప్‌సింగ్‌ను ఆడించలేదని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఎక్కువగా వన్డే మ్యాచ్‌లు లేకపోవడంతో ఆటగాళ్లను రొటేట్ చేస్తున్నామని స్పష్టం చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్‌ను ఆడించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
సౌతాఫ్రికాతో జరిగిన గత వన్డే సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ మెరుగైన ప్రదర్శన చేసినా అతన్ని పక్కనపెట్టడం ఏంటి? అనే ప్రశ్నలు వచ్చాయి. గంభీర్ తన ఫేవరేట్ ప్లేయర్లు హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణల కోసం అర్ష్‌దీప్ సింగ్‌కు అన్యాయం చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఉన్న అర్ష్‌దీప్‌ను ఇలా పక్కనపెడితే అతని రిథమ్ దెబ్బతిని, ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్ అనంతరం అర్ష్‌దీప్ సింగ్ వ్యవహారంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ప్రశ్నించగా.. అతను వివరణ ఇచ్చాడు. ఆటగాళ్ల రొటేషన్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాడు. తన వ్యక్తిగత ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసిన గిల్.. విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. బ్యాటింగ్‌ను కోహ్లీ చాలా సులువు చేస్తున్నాడని తెలిపాడు. వాషింగ్టన్ సుందర్‌కు సైడ్ స్ట్రెయిన్ గాయమైందని, స్కానింగ్ తర్వాతే క్లారిటీ వస్తుందని చెప్పాడు.
'ఛేజింగ్‌లో జట్టు విజయానికి తోడ్పడటం అందించడం గొప్ప అనుభూతినిస్తుంది. క్రీడాకారులు అంతా ప్రస్తుతం జరుగుతున్న దానిపై ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. నేను కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం కోహ్లీ బ్యాటింగ్‌ను చాలా సులువు చేస్తున్నాడు. ఇలాంటి పిచ్‌లపై ఇన్నింగ్స్ ప్రారంభించడం కష్టం. కోహ్లీ బ్యాటింగ్‌ను అనుకరించడం కూడా అంత సులువు కాదు.
అతను ఇలాగే పరుగులు చేస్తూ ఉండాలని ఆశిస్తున్నా. గత సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ బాగా రాణించాడు. ఆ సిరీస్‌లో సిరాజ్ లేడు. ఎక్కువ వన్డే మ్యాచ్‌లు కూడా లేవు కాబట్టి ఆటగాళ్లను రొటేట్ చేయాలనుకున్నాం. అందులో భాగంగానే తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్‌కు విశ్రాంతి ఇచ్చి సిరాజ్‌ను ఆడించాం. వాషింగ్టన్ సుందర్‌కు సైడ్ స్ట్రెయిన్ గాయమైంది. స్కానింగ్ తర్వాతే అతని గాయం తీవ్రత తెలియనుంది.'అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.