Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: అందుకే అర్ష్‌దీప్ సింగ్‌ను పక్కనపెట్టాం: శుభ్‌మన్ గిల్

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని న్యూజిలాండ్ తాత్కలిక వన్డే కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్ తెలిపాడు. డ్యూ ప్రభావం ఉండనుందని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. డ్యూ ప్రభావం ఉంటుందని భావిస్తున్నాం. గత మ్యాచ్‌లో విజయం కోసం ఆఖరి వరకు పోరాడం.

గత మ్యాచ్‌తో పోల్చితే ఇక్కడి కండిషన్స్ పూర్తి భిన్నంగా ఉన్నాయి. 40 వేల మంది అభిమానులు ఒక జట్టుకు అండగా నిలిచారు. తుది జట్టులో ఒక మార్పు చేశాం. లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు.'అని బ్రేస్‌వెల్‌ చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిచినా తాము ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. గత రాత్రి డ్యూ కనిపించలేదని, ఆట సాగుతున్న కొద్దీ పిచ్ స్లోగా మారుతుందని చెప్పాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. నిన్న డ్యూ కనిపించలేదు. ఇక్కడి ప్లేయర్లతో మాట్లాడితే మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ స్లోగా అవుతుందని చెప్పారు.

Shubman Gill Explains Why Arshdeep Singh Missed India s 2nd ODI Against New Zealand

నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. జట్టు విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉన్నాను. ఈ రోజు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడుతానని ఆశిస్తున్నా. మా ఆరంభం బానే ఉంది. కానీ మిడిల్ ఓవర్స్‌లో పుంజుకోవడంపై ఫోకస్ పెట్టాలి. పేసర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. వాషింగ్టన్ సుందర్ స్థానంలో నితీష్ రెడ్డి ఆడుతున్నాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. పేసర్ల రొటేషన్ పాలసీలో భాగంగానే అర్ష్‌దీప్ సింగ్‌‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వలేదని గిల్ స్పష్టం చేశాడు.

తుది జట్లు:

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్ కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, జేడెన్ లెనాక్స్, కైల్ జేమీసన్, క్రిస్టియన్ క్లార్క్.

భారత్ : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్. రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Story first published: Wednesday, January 14, 2026, 13:22 [IST]
Other articles published on Jan 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+