Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: అందుకే నితీష్ కుమార్ రెడ్డిని ఆడించడం లేదు: శుభ్‌మన్ గిల్

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ స్లోగా మారే అవకాశం ఉందని చెప్పాడు. మానవ్ సుతార్ అరంగేట్రం చేస్తున్నాడని తెలిపిన గిల్.. డబ్ల్యూటీసీ సైకిల్‌ను దృష్టిలో ఉంచుకొని టీమ్ కాంబినేషన్‌పై ప్రత్యేకమైన దృష్టి సారించామని వెల్లడించాడు.

'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. వాతావరణం చాలా వేడిగా, ఉక్కపోతగా ఉంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ పిచ్ స్లోగా మారడంతో పాటు బౌన్స్ తగ్గే అవకాశం ఉంది. నా సొంతమైదానంలో కెప్టెన్‌గా టెస్ట్ మ్యాచ్ ఆడటం చాలా ప్రత్యేకం. ఎందుకుంటే నేను ఇక్కడే ఆడుతూ ఈ స్థాయికి ఎదిగాను. నా హోమ్ గ్రౌండ్‌లో టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవం.

IND vs AFG Shubman Gill Details Playing XI Combinations and Why Nitish Kumar Reddy Harsh Dubey Missed Selection
Photo Credit: BCCI(X)

ఈ మ్యాచ్ కోసం మేం బాగా సన్నదమయ్యాం. గత రెండు రోజులుగా మాకు మంచి నిద్ర, విశ్రాంతి లభించాయి. ఈ మ్యాచ్ తర్వాత మాకు మొత్తం 9 టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి. అందులో చాలా వరకు సొంత గడ్డపై హోమ్ మ్యాచ్‌లే ఎక్కువగా ఉన్నాయి. సరైన కాంబినేషన్‌ను ఎంచుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. మా జట్టు నుంచి మానవ్ సుతార్ అరంగేట్రం చేస్తున్నాడు.'అని గిల్ పేర్కొన్నాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబేలను తీసుకోలేదన్నాడు.

IPL 2026 Final: 180 కొడితే గెలిచేవాళ్లం: శుభ్‌మన్ గిల్

IPL 2026 Final: 180 కొడితే గెలిచేవాళ్లం: శుభ్‌మన్ గిల్

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అన్నాడు. 'పిచ్ చూడటానికి చాలా బాగుంది. మేం కూడా మొదట బ్యాటింగ్ చేయాలనే అనుకున్నాం. కానీ టాస్ మన చేతుల్లో లేని విషయం. మేం మంచి క్రికెట్ ఆడాల్సి ఉంది. మేం ఈ సవాలుకు సిద్ధంగా ఉన్నాం. మాకు సవాళ్లు అంటే ఇష్టం. ఈ మ్యాచ్ కోసం మేం చాలా బాగా సన్నద్ధమయ్యాం.

కాబూల్‌లో మాకు మంచి ప్రిపరేషన్ క్యాంప్ లభించింది. రిచర్డ్ పైబస్ చాలా మంచివాడు. చాలా సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి. మేం ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నాం. మా జట్టు నుంచి నంగేయాలియా ఖరోటే అరంగేట్రం చేస్తున్నాడు.'అని హష్మతుల్లా షాహిదీ చెప్పుకొచ్చాడు.

శుభ్‌మన్ గిల్.. టీమిండియా నీ అయ్య జాగీరా?

శుభ్‌మన్ గిల్.. టీమిండియా నీ అయ్య జాగీరా?

తుది జట్లు:

అఫ్గానిస్థాన్: సెదిఖుల్లా అటల్, రహ్మానుల్లా గుర్బాజ్, అబ్దుల్ మాలిక్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), అఫ్సర్ జజాయ్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, నంగేయాలియా ఖరోటే, జియావుర్ రహ్మాన్ షరీఫీ, మహమ్మద్ సలీమ్ సఫీ.

భారత్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

Story first published: Saturday, June 6, 2026, 9:32 [IST]
Other articles published on Jun 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+