Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫాలో-ఆన్ నిర్ణయం వల్ల కాదు.. వారి వల్లే విజయం దక్కలేదు: శుభ్‌మన్ గిల్

శ్రీలంకతో రెండో టెస్ట్‌ డ్రా కావడానికి ఫాలో-ఆన్ నిర్ణయం కారణం కాదని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. శ్రీలంక బ్యాటర్ల అద్వితీయమైన పోరాటంతోనే విజయం సాధించలేకపోయామని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ డ్రా అయినా.. టెస్ట్ క్రికెట్ గెలిచిందని శుభ్‌మన్ గిల్ తెలిపాడు. కొలంబో వేదికగా గురువారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా చేజేతులా విజయాన్ని చేజార్చుకుంది.

శ్రీలంక చివరి 4 వికెట్లు తీయలేక మూల్యం చెల్లించుకుంది. 229/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 154 ఓవర్లలో 429/9 స్కోర్ వద్ద డ్రా చేసింది. 18 ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. సోనాల్ దినుషా(264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) అజేయ శతకంతో శ్రీలంకకు ఓటమి తప్పించాడు.దాంతో ఈ రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

Shubman Gill Defends Follow-On Decision Credits Sri Lanka Batters for Colombo Test Draw

శ్రీలంక ప్రదర్శనతోనే..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించే తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేని గురించైనా మాట్లాడొచ్చని తెలిపాడు. 'నిజాయితీగా చెప్పాలంటే.. విజయం కోసం మేం చేయాల్సిందంతా చేశాం. మూడు రోజుల పాటు ఫీల్డింగ్ చేశాం. కానీ శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. అద్భుతమైన నైపుణ్యాన్ని చూపించారు. వారికి కొద్దిగా అదృష్టం కూడా కలిసొచ్చింది.

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

IND vs SL: పంత్, మానవ్ సుతార్ వ్యూహం.. చేజారిన పసిందు శతకం! (వీడియో)

ఈ మ్యాచ్‌లో విజయం దక్కకపోయినా.. చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ప్రత్యర్థి ఆట తీరు నుంచి కూడా మేం నేర్చుకున్నాం. శ్రీలంక తీవ్ర ఒత్తిడిలో కూడా అద్భుతంగా పుంజుకుంది. దేవదత్ పడిక్కల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. మానవ్ సుతార్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. పేసర్లు కూడా తమ వంతు ప్రయత్నం చేశారు.

ఇప్పుడు ఆలోచిస్తే తప్పుగా అనిపిస్తోంది..

ఈ సిరీస్ మాకు అద్భుతంగా సాగింది. మానవ్ సుతార్‌లో నాకు నచ్చని విషయం అంటూ ఏదీ లేదు. అతను నిలకడగా రాణించే విధానం, బౌలింగ్ చేసే తీరు అన్నీ ఆకట్టుకున్నాయి. అతని బౌలింగ్ చూడముచ్చటగా అనిపించింది. భవిష్యత్తులో అతను మా జట్టుకు కీలకమైన బౌలర్ అవుతాడు.

ఫాలో-ఆన్ నిర్ణయం గురించి ఇప్పుడు ఆలోచిస్తే అది తప్పుగానే అనిపిస్తుంది. కానీ శ్రీలంక అద్భుతమైన ప్రదర్శనతోనే మేం విజయం సాధించలేకపోయాం. ఆ సమయంలో ఉన్న పరిస్థితులు ఆధారంగానే ఫాలో-ఆన్ నిర్ణయం తీసుకున్నాం. కానీ కొన్ని విషయాలు మాకు కలిసి రాలేదు.

మైదానంలోనూ, బయట మా ప్రదర్శన, సన్నద్ధతలో స్థిరత్వం చాలా ముఖ్యం. త్వరలో మేం న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్నాం. ఆ తర్వాత సొంతగడ్డపై మంచి సిరీస్‌లు ఉన్నాయి. మాపై మాకు నమ్మకం ఉంది, కచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకుంటాం'అని శుభ్‌మన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు.

IND vs SL: టీమిండియా కొంపముంచిన సోనాల్ దినుషా.. డ్రాతో గట్టెక్కిన శ్రీలంక!

Also Read

IND vs SL: టీమిండియా కొంపముంచిన సోనాల్ దినుషా.. డ్రాతో గట్టెక్కిన శ్రీలంక!


సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 503/9 డిక్లేర్డ్ (దేవదత్ పడిక్కల్ 117, ధ్రువ్ జురెల్ 115 నాటౌట్)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 ఆలౌట్(పసిందు సూర్యబండార 80, సోనాల్ దినుషా 103)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 429/9డిక్లేర్డ్(పసిందు సూర్యబండార 92, కామిందు మెండీస్ 55, సోనాల్ దినుషా 133 నాటౌట్)

Story first published: Thursday, August 27, 2026, 20:53 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+