Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి వల్లే ఈ విజయం.. ఆశలు కల్పించారు: శుభ్‌మన్ గిల్

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేయడంపై టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్, లోయరార్డర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఈ విజయం సాధ్యమైందని తెలిపాడు. ముఖ్యంగా తమ లోయరార్డర్ బ్యాటర్లు మ్యాచ్ ముగించిన తీరు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు.

IND vs ENG తొలి వన్డేలో ధోనీ సందడి.. ముసలోడిని అయిపోయా అంటూ సైగలు! (వీడియో)

IND vs ENG తొలి వన్డేలో ధోనీ సందడి.. ముసలోడిని అయిపోయా అంటూ సైగలు! (వీడియో)

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 259 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలమైనా.. శుభ్‌మన్ గిల్(80 రిటైర్డ్ హర్ట్), శ్రేయస్ అయ్యర్(35) ఆదుకున్నారు. క్రాంప్స్‌తో గిల్ మైదానం వీడినా.. అయ్యర్ రనౌట్ అయినా అక్షర్ పటేల్(57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

Shubman Gill Credits India s Middle Order Batting and Bowling for Crucial Victory Over England in 1st ODI

మా వాళ్లు అదరగొట్టారు..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. 'మా మిడిల్, లోయరార్డర్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలిపించడం కెప్టెన్‌గా, టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. మా బౌలింగ్ లైనప్‌లో యువకులు ఉన్నారు. కానీ మా బ్యాటింగ్ లైనప్ చాలా అనుభవజ్ఞులతో కూడుకున్నది. కాబట్టి ఇంగ్లండ్ 300 పరుగులు చేసినా మేం ఆ లక్ష్యాన్ని ఛేదించగలమనే నమ్మకం ఉంది. అందుకే ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం.

మిడిల్ ఓవర్లలో మేం బౌలింగ్ చేసిన విధానం చాలా సంతోషాన్నిచ్చింది. పవర్ ప్లే చివర్లో ఇంగ్లండ్ బ్యాటర్లు మమ్మల్ని ఒత్తిడికి గురిచేశారు. కానీ మేం పుంజుకున్న విధానం, 5 వికెట్లు పడగొట్టిన విధానం గేమ్ ఛేజింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో మా బలాన్ని పెంచుకునేందుకు తదుపరి మ్యాచ్‌ల్లో విభిన్న కాంబినేషన్స్‌ను ప్రయత్నిస్తాం. అది మాకు సుదీర్ఘమైన బ్యాటింగ్ ఆర్డర్‌ను అందిస్తుంది.

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

IND vs ENG: ఆ ఘోర తప్పిదమే మా ఓటమిని శాసించింది: హ్యారీ బ్రూక్

సౌతాఫ్రికా తరహా పరిస్థితులు..

ఇంగ్లండ్ పరిస్థితులు దాదాపు సౌతాఫ్రికా మాదిరిగానే ఉంటాయి. కొత్త బంతితో పరుగులు రాబట్టడం బ్యాటర్లకు అంత సులువు కాదు. బంతి బాగా బౌన్స్ అవ్వడంతో పాటు స్వింగ్ అవుతోంది. దాంతో ఆరంభంలో పరుగులు చేయడం ఈజీ కాదు. ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. సౌతాఫ్రికాలో కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. కాబట్టి మేం విభిన్నమైన కాంబినేషన్స్ ప్రయోగిస్తే.. మా జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, July 15, 2026, 8:17 [IST]
Other articles published on Jul 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+