Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని వల్లే ఈ విజయం.. గెలుపుపై కాస్త కంగారు పడ్డా: శుభ్‌మన్ గిల్

దేవదత్ పడిక్కల్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతోనే శ్రీలంకతో తొలి టెస్ట్‌లో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను అందించిన భారీ స్కోర్.. మ్యాచ్‌ను తమవైపు మలుపు తిప్పిందన్నాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఐదు రోజుల పాటు సాగిన తొలి మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది.

372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా 84/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ విజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Shubman Gill Credits Devdutt Padikkal for India s Victory Over Sri Lanka in Galle Test
Photo Credit: X (twitter)

ఈ విజయం ప్రత్యేకం..

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్‌మన్ గిల్.. వర్షం ప్రభావం ఉండటంతో గెలుపు విషయంలో కాస్త కంగారు పడ్డానని తెలిపాడు. 'భారత్‌కు ఇది 600వ టెస్ట్ మ్యాచ్. ఈ గెలుపు ఎంతో ప్రత్యేకమైనది. మాకు ఎంతో సంతృప్తినిచ్చిన విజయం. ఈ గెలుపు విషయంలో మేం చాలా సౌకర్యవంతంగా ఉన్నామని భావించాను. కానీ వాతావరణం కారణంగా ఆఖరి రోజు ఆట సాగుతుందో లేదోనని కంగారు పడ్డాను. దాంతో కాస్త ఒత్తిడికి గురయ్యాం. కానీ జట్టు అద్భుతంగా డీల్ చేసింది.

దూకుడుగా ఆడే క్రమంలో..

మా రెండో ఇన్నింగ్స్ వైఫల్యంపై ఎలాంటి ఆందోళన లేదు. ఎందుకంటే మేం 400 పరుగులు లక్ష్యాన్ని నమోదు చేయాలనుకున్నాం. అందుకోసం కాస్త వేగంగా ఆడాం. కానీ ఇలాంటి వికెట్‌పై ఇష్టమొచ్చినట్లు పరుగులు చేయడం అంత సులువు కాదు. 4, 5వ రోజుల్లో ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలమనే విషయంపై మాకు క్లారిటీ లేదు. శ్రీలంకను ఎక్కువ ఓవర్లు ఆడించాలనే ఉద్దేశంతో దూకుడుగా ఆడాలని చూశాం. ఈ క్రమంలోనే త్వరగా వికెట్లు కోల్పోయాం. అయినా మేం మెరుగైన స్థితిలో నిలిచాం.

అఫ్గానిస్థాన్‌తో తన తొలి మ్యాచ్‌లో మానవ్ సుతార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదే జోరును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. అతను ఎంతో ప్రతిభావంతుడిగా కనిపిస్తున్నాడు. భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడే సామర్థ్యం అతనికి ఉంది.

దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ చూడ ముచ్చటగా అనిపించింది. సెంచరీ చేసిన తర్వాత కూడా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి మాకు భారీ స్కోర్ అందించాడు. రసవత్తరంగా ఉన్న మ్యాచ్‌ను మా వైపు సౌకర్యవంతంగా మార్చాడు. అలాగే రెండో ఇన్నింగ్స్‌లో కూడా అతను ఆడిన తీరు.. స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించిన తీరు కనుల పండుగగా అనిపించింది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడమే మా అంతిమ లక్ష్యం. టెస్ట్ విజయాలు అంత సులువుగా రావు. కానీ ఈ విజయం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 462 ఆలౌట్ (దేవదత్ పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ప్రబాత్ జయసూర్య 4/109)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 284 ఆలౌట్( సొనాల్ దినుషా 100, నిరోషణ్ డిక్‌వెల్లా 80)

భారత్ రెండో ఇన్నింగ్స్ 193 ఆలౌట్(రిషభ్ పంత్ 66, దేవదత్ పడిక్కల్ 44)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 206 ఆలౌట్ (ధనంజయ డిసిల్వా 59 , సోనాల్ దినుషా 84)

Story first published: Wednesday, August 19, 2026, 15:42 [IST]
Other articles published on Aug 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+