Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌గిల్.. 47 ఏళ్లలో ఒకే ఒక్కడు!

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. గత 47 ఏళ్లలో విదేశీ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్‌లో 4 శతకాలు నమోదు చేసిన తొలి కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డ్ సాధించాడు. ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా శుభ్‌మన్ గిల్ ఈ ఫీట్ సాధించాడు. ఆఖరి రోజు ఆటలో క్రిస్ వోక్స్ వేసిన 83వ ఓవర్ ఆఖరి బంతికి క్విక్ సింగిల్ తీసిన శుభ్‌మన్ గిల్ 228 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 9వ టెస్ట్ శతకం.

మూడో బ్యాటర్‌గా రికార్డ్..

ఓ టెస్ట్ సిరీస్‌లో నాలుగు శతకాలు నమోదు చేసిన మూడో భారత బ్యాటర్‌గా కూడా శుభ్‌మన్ గిల్ రికార్డ్ సాధించాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్ వెస్టిండీస్‌పై 1971, 1979 సిరీస్‌ల్లో రెండు సార్లు నాలుగేసి శతకాలు నమోదు చేయగా.. విరాట్ కోహ్లీ 2015లో ఆస్ట్రేలియాపై 4 సెంచరీలు బాదాడు. తాజాగా శుభ్‌మన్ గిల్ ఈ ఫీట్ సాధించాడు. ఓ టెస్ట్ సిరీస్‌లో నాలుగు శతకాలు బాదిన నాలుగో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ గుర్తింపు పొందాడు. సర్ డాన్ బ్రాడ్ మాన్ 1948లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. సునీల్ గవాస్కర్ 1979లో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 సెంచరీలు బాదాడు. తాజాగా శుభ్‌మన్ గిల్.. ఇంగ్లండ్‌పై ఈ ఫీట్ సాధించాడు.

Shubman Gill Creates History First Captain in 47 Years with Four Away Series Centuries Ends 35-Year Indian Century Drought at Manchester

గ్రేగ్ చాపెల్ రికార్డ్ బద్దలు..

కెప్టెన్‌గా అరంగేట్ర టెస్ట్ సిరీస్‌లోనే అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కూడా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డ్‌ను అధిగమించేందుకు గిల్.. 89 పరుగుల దూరంలో ఉన్నాడు. ఆఖరి టెస్ట్‌లో ఈ పరుగులు చేస్తే బ్రాడ్ మన్ రికార్డ్ కూడా బద్దలవనుంది. బ్రాడ్ మన్ 1937లో ఇంగ్లండ్‌పై కెప్టెన్‌గా అరంగేట్ర సిరీస్‌లో 810 పరుగులు చేశాడు. ఆ తర్వాత శుభ్‌మన్ గిల్(722*) రెండో స్థానంలో ఉండగా.. గ్రేగ్ చాపెల్(1976లో 702), క్లైవ్ లాయడ్(1975లో 636), పీటర్ మే(1955లో 582) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఓటమి దిశగా భారత్..

సెంచరీ పూర్తయిన వెంటనే శభ్‌మన్ గిల్‌(103) ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 34 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జడేజా మరో వికెట్ పడకుండా తొలి సెషన్ ముగించాడు. దాంతో భారత్ 223/4 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. టీమిండియా ఇంకా 88 పరుగుల వెనుకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తప్పించుకోవాలంటే మరో 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాలి. అప్పుడే టీమిండియా డ్రాతో గట్టెక్కుతుంది. మరోవైపు ఇంగ్లండ్‌ విజయానికి 6 వికెట్లు కావాలి.

Story first published: Sunday, July 27, 2025, 18:02 [IST]
Other articles published on Jul 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+