For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ZIM: చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్!

టీమిండియా తాత్కలిక సారథి శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో వరుసగా నాలుగు విజయాలు సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డ్ సాధించాడు. జింబాబ్వే పర్యటనలోని ఐదు టీ20ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవడం ద్వారా ఈ ఫీట్ సొంతం చేసుకున్నాడు.ఈ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 42 పరుగులతో గెలిచి ఈ పర్యటనను విజయంతో ముగించింది.

భారత టీ20 జట్టుకు 14వ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ(50), ధోనీ(42), విరాట్ కోహ్లీ(32), హార్దిక్ పాండ్యా(10), సూర్యకుమార్ యాదవ్(5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డ్ సాధించాడు.

Shubman Gill Create History Become First Indian captain Ever To 4 consecutive wins in overseas

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించాడు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు తీయగా.. సికందర్ రాజా, బ్రాండన్ మవుతా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే ముఖేష్ కుమార్ ధాటికి 125 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైర్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34), మరుమని(24 బంతుల్లో 5 ఫోర్లతో 27), ఫరాజ్ అక్రమ్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే(2/25) రెండు వికెట్లు తీసాడు.

Story first published: Monday, July 15, 2024, 16:04 [IST]
Other articles published on Jul 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+