Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చారిత్రాత్మక పోరుకు నాయకత్వం గర్వంగా ఉంది.. అదే తలనొప్పిగా మారింది: శుభ్‌మన్ గిల్

స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా టీమిండియా ఆడే 600వ టెస్ట్ మ్యాచ్‌కు నాయకత్వం వహించడం చాలా గర్వంగా ఉందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2027 ఫైనల్ బెర్త్‌ను దక్కించుకోవడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని చెప్పాడు. తుది జట్టు ఎంపిక తలనొప్పిగా మారిందన్నాడు.

IND vs SL: మొత్తానికి అయ్యగారూ బరిలోకి దిగారు.. క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు!

IND vs SL: మొత్తానికి అయ్యగారూ బరిలోకి దిగారు.. క్లాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టారు!

డబ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో భాగంగా శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. రేపు( శనివారం) గాలే అంతర్జాతీయ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది భారత్‌కు 600వ టెస్ట్ మ్యాచ్. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఈ మ్యాచ్ జరుగుతుండటం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సిరీస్‌కు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది.

Shubman Gill Calls Leading India in 600th Test a Proud Moment Eyes WTC Comeback ahead of 1st Test vs Sri Lanka

చాలా గర్వంగా ఉంది..

ఈ మ్యాచ్ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శుభ్‌మన్ గిల్ పాల్గొన్నాడు. సిరీస్ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ రేసులో నిలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. 'కెప్టెన్సీ బాధ్యతల్లో నేను చాలా సౌకర్యంగా ఉన్నా. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉంచుకోవడమే మా లక్ష్యం. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కాలంటే.. కనీసం మేం ఏడు టెస్ట్‌ల్లో గెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి ఫ్రెష్‌గా మెదలుపెడుతాం. అంతేకాకుండా స్వాతంత్ర్య దినోత్సవం నాడే భారత్ 600వ టెస్ట్ మ్యాచ్‌ ఆడుతోంది. ఇలాంటి చారిత్రాత్మక పోరుకు సారథ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం.

మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఆటగాళ్లకు కాస్త సమయం ఇవ్వాలి. కొందరికీ కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అయినా సరే వారికి అండగా ఉంటాం. మూడో స్థానంలో సాయి సుదర్శన్ మెరుగ్గా రాణించాడు. కానీ అతను గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. బీసీసీఐ సీఓఈ, టీమ్ మేనేజ్‌మెంట్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. మేం కోరుకున్నంత వేగంగా సాయి సుదర్శన్ కోలుకోలేకపోయాడు. అయితే మా జట్టులోని 15 మంది ఆటగాళ్లపై మాకు నమ్మకం ఉంది.

IND vs SL: తొలి టెస్ట్‌కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా.. సర్ఫరాజ్‌కు చోటు!

Also Read

IND vs SL: తొలి టెస్ట్‌కు ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా.. సర్ఫరాజ్‌కు చోటు!

టీమ్ కాంబినేషన్ తలనొప్పిగా మారింది..

తుది జట్టును ఇంకా ఖరారు చేయలేదు. పేసర్ల ఎంపిక తలనొప్పిగా మారింది. గుర్నూర్ బ్రార్ పాత బంతితోనూ అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. బౌన్స్‌ను కూడా రాబడతాడు. అయితే ప్రసిధ్ కృష్ణ వామప్ మ్యాచ్‌లో కూడా సత్తా చాటాడు. సిరాజ్‌తో పాటు రెండో పేసర్ ఎవరా? అనేది తేల్చుకోలేకపోతున్నాం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది జట్టును ఎంపిక చేస్తాం.'అని శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు.

Story first published: Friday, August 14, 2026, 17:03 [IST]
Other articles published on Aug 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+