ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో తాను ఆడిన సెంచరీ ఇన్నింగ్స్ కెరీర్‌లోనే అత్యుత్తమమైనదని టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్((102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112) సెంచరీతో రాణించాడు.
విరాట్ కోహ్లీతో రెండో వికెట్‌కు 116 పరుగులు జోడించిన గిల్.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ వరుసగా 87, 60, 112 పరుగులతో రాణించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉండటంతో వ్యూహాత్మకంగా ఆడినట్లు తెలిపాడు.

కఠినమైన పిచ్‌పై..
'కచ్చితంగా ఈ ఇన్నింగ్స్ నా వన్డే కెరీర్‌లోనే అత్యుత్తమమైనది. ఈ మ్యాచ్‌లో రాణించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆరంభంలో ఈ పిచ్ బ్యాటింగ్‌కు కఠినంగా ఉంది. అందుకే ఈ సెంచరీ ఇన్నింగ్స్ నాకు సంతృప్తినిచ్చింది. పేసర్లకు కాస్త సహకారం లభించింది. బంతి సీమ్ అయ్యింది. దాంతో నేను, విరాట్ భాయ్ స్ట్రైక్ రోటేట్ చేయాలనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పవర్ ప్లేలో వికెట్ కోల్పోవద్దని భావించాం. మూమెంటమ్ తీసుకొచ్చి ఇన్నింగ్స్ నిర్మించాం. ఈ మ్యాచ్‌లో నా బ్యాటింగ్ అప్రోచ్ కొత్తగా ఏం లేదు. ఎలాంటి ఆలోచనలు లేకుండా బరిలోకి దిగి పరిస్థితులకు తగ్గట్లు రియాక్ట్ అయ్యాను.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
శతక్కొట్టిన గిల్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112) శతకంతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 78) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(4/64) నాలుగు వికెట్లు తీసాడు. రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ(1).. ఈ మ్యాచ్‌లో మాత్రం రెండో బంతికే ఔటయ్యాడు.
చెలరేగిన బౌలర్లు..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. టామ్ బాంటన్(41 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38), గస్ అట్కిన్సన్(19 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.