టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఒక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం ఓవల్ వేదికగా ప్రారంభమైన ఆఖరి టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(2), కేఎల్ రాహుల్(14) వికెట్లను కోల్పోయింది. అట్కిన్సన్ బౌలింగ్‌లో జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో త్వరగానే క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్.. జెమీ ఓవర్టన్ వేసిన 21వ ఓవర్ ఆఖరి బంతిని కవర్స్ దిశగా బౌండరీ బాది ఈ సిరీస్‌లో 733 పరుగుల మార్క్ అందుకున్నాడు.

ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న 47 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టి ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. 1978లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో సునీల్ గవాస్కర్ 732 పరుగులు చేశాడు. ఈ జాబితాలో 737* పరుగులతో శుభ్‌మ్ గిల్ టాప్‌లో నిలిచాడు. సునీల్ గవాస్కర్ 732 రెండో స్థానంలో ఉండగా.. తర్వాతి మూడు స్థానాల్లో విరాట్ కోహ్లీనే ఉన్నాడు. 2016-17లో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కోహ్లీ 655 పరుగులు చేశాడు. 2017-18లో శ్రీలంకతో 610, 2018లో ఇంగ్లండ్‌తో 593 పరుగులు చేశాడు.
737* - శుభ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్, 2025*
732 - సునీల్ గవాస్కర్ vs వెస్టిండీస్, 1978/79
655 - విరాట్ కోహ్లీ vs ఇంగ్లాండ్, 2016/17
610 - విరాట్ కోహ్లీ vs శ్రీలంక, 2017/18
593 - విరాట్ కోహ్లీ vs ఇంగ్లాండ్, 2018
ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు నాలుగు సెంచరీలు చేశాడు. ఐదో టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 72/2తో నిలిచింది. క్రీజులో సాయి సుదర్శన్(25 బ్యాటింగ్)తో పాటు శుభ్‌మన్ గిల్(15 బ్యాటింగ్) ఉన్నాడు. లంచ్ బ్రేక్‌కు కొన్ని ఓవర్ల ముందే వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపేసారు. నిర్ణీత సమయం కన్నా ముందే లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఆ తర్వాత వర్షం దాగుడు మూతలు ఆడటం.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఆటకు సాధ్యం కాలేదు. గ్రౌండ్‌ను అంపైర్లు పరిశీలించి ఆటను కొనసాగించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. వర్షం కారణంగా తొలి రోజు ఆట సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు.