Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ మూడు ఓవర్లే మా ఓటమిని శాసించాయి: శుభ్‌మన్ గిల్

బౌలింగ్‌లో ఆఖరి మూడు ఓవర్లే తమ ఓటమిని శాసించాయని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. 45వ ఓవర్ వరకు గట్టి పోటీ ఇచ్చామని, కానీ చివరి మూడు ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఐకానిక్ లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ కోల్పోయింది.

IND vs ENG: టీమిండియాకు డబుల్ షాక్.. టి20ల తర్వాత వన్డే సిరీస్ కూడా అవుట్!

IND vs ENG: టీమిండియాకు డబుల్ షాక్.. టి20ల తర్వాత వన్డే సిరీస్ కూడా అవుట్!

ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. భారత్ చెత్త బౌలింగ్‌తో 387 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. అనంతరం భారత్ 360 పరుగులే చేసి ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(138) భారీ శతకంతో చెలరేగినా.. శుభ్‌మన్ గిల్(77), విరాట్ కోహ్లీ(74) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది.

Shubman Gill Blames Death Overs Bowling for India Defeat in 3rd ODI against England

ఆ మూడు ఓవర్లు సరిగ్గా వేసి ఉంటే..

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. చివరి మూడు ఓవర్లను కట్టడిగా బౌలింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. 'ఈ మ్యాచ్‌లో 45వ ఓవర్ వరకు మేం గట్టి పోటీ ఇచ్చాం. కానీ బౌలింగ్‌లో ఆఖరి మూడు ఓవర్లలో 60 ప్లస్ రన్స్ సమర్పించుకున్నాం. అక్కడే మ్యాచ్ మా చేతుల్లోంచి జారిపోయింది. అయినా ఛేజింగ్‌లో మేం పోరాడాం.

40 ఓవర్ల తర్వాత మా చేతిలో వికెట్లు ఉంటే మేం గెలిచేవాళ్లం. ఏ దశలోనూ మేం ఓటమికి అంగీకరించలేదు. అందుకే పవర్ ప్లే తర్వాత దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాం. రన్‌రేట్‌ను 6- 6.5 ఉండేలా ఆడాం. అలా ఆడి చివరి 10 ఓవర్లలో 100-110 పరుగులు చేయాల్సి వస్తే.. మ్యాచ్ గెలవచ్చని భావించాం.

FIFA World Cup 2026 ఫైనల్లో ఓటమి.. మైదానంలోనే కొట్టుకున్న ఆటగాళ్లు! (వీడియో)

FIFA World Cup 2026 ఫైనల్లో ఓటమి.. మైదానంలోనే కొట్టుకున్న ఆటగాళ్లు! (వీడియో)

రోహిత్ బ్యాటింగ్ అద్భుతం..

ఈ సిరీస్‌లో ఓడినా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా బ్యాటర్లంతా మెరుగైన ప్రదర్శన చేశారు. కానీ మా బౌలింగ్‌ బాలేదు. ముఖ్యంగా పవర్ ప్లేలో లూజ్ డెలివరీలు వేసి మూల్యం చెల్లించుకున్నాం. ఇంగ్లండ్ ఓపెనర్లు ఈ లూజ్ డెలివరీలను అద్భుతంగా ఉపయోగించుకున్నారు. మ్యాచ్‌లోకి తిరిగి రావడానికి వారు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

డెత్ ఓవర్లలో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగారు. బ్యాటర్లంతా పరుగులు చేయడం.. బౌలర్లంతా వికెట్లు తీయడం మాకు లభించిన సానుకూల అంశాలు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ముఖ్యంగా రోహిత్ భాయ్ సెంచరీతో చెలరేగడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. చివర్లో వికెట్ కాస్త స్లోగా మారింది. దాంతోనే పరుగులు చేయడం కష్టమైంది. కానీ రోహిత్ బ్యాటింగ్ చేసిన తీరు చూడముచ్చటగా అనిపించింది.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, July 20, 2026, 7:43 [IST]
Other articles published on Jul 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+