Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి వైఫల్యమే మా కొంపముంచింది: శుభ్‌మన్ గిల్

మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం, లోయార్డర్ బ్యాటర్ల వైఫల్యం తమ ఓటమిని శాసించిందని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. 300-310 పరుగులు చేసి ఉంటే విజయం సాధించేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

IND vs ENG: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. రాహుల్ ద్రవిడ్ ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్!

మా టెయిలెండర్స్ ఆడి ఉంటే..

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై నిరాశను వ్యక్తం చేసిన శుభ్‌మన్ గిల్.. బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. ' మెరుగైన ఆరంభం లభించిన తర్వాత కూడా 233 పరుగులకు ఆలౌటవ్వడం తీవ్ర నిరాశకు గురిచేసింది. 25 ఓవర్ల తర్వాత మేం ఉన్న స్థితిని చూసి 300-310 పరుగులు మంచి స్కోర్ అవుతుందని భావించాం. కానీ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం.

Shubman Gill Blames Batting Collapse for India s Defeat to England in 2nd ODI at Cardiff

మా టెయిలెండర్లు అత్యుత్తమ బ్యాటర్లు ఏం కాదు.. కానీ లోయర్-మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల నుంచి మెరుగైన ప్రదర్శనను ఆశించాం. మాకు లభించిన మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. భారీ స్కోర్‌గా మలచలేకపోయాం. నేను చెత్త షాట్‌తో ఔటయ్యాను. బంతిని నేరుగా కవర్స్ ఫీల్డర్ చేతుల్లోకి కొట్టి వెనుదిరగడం ఎవరికి నచ్చదు.

అతని గాయం దెబ్బతీసింది..

వాషింగ్టన్ సుందర్ మా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడు. బ్యాటింగ్ సమయంలోనే రన్ తీస్తూ గాయపడ్డాడనుకుంటా. బహుషా అతను బౌలింగ్ చేసి ఉంటే ప్రత్యర్థిపై మరింత ఒత్తిడిని పెంచడంలో సాయపడేవాడేమో. అతని గైర్హాజరీతో ఇన్నింగ్స్ పొడవునా మా ప్రధాన బౌలర్లతోనే బౌలింగ్ చేయించాల్సి వచ్చింది.

IND vs ENG: రెండో వన్డేలో భారత్ ఓటమి!

IND vs ENG: రెండో వన్డేలో భారత్ ఓటమి!

అయితే ఈ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో సుందర్ దూరమైనా.. పెద్ద తేడా చూపించలేదు. కానీ అలా కీలక ఆటగాడు దూరమవ్వడం వల్ల వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చింది. బౌలింగ్ ఆప్షన్స్ తగ్గాయి. ఈ క్రమంలోనే ఆట పరంగా మేం మూమెంటమ్ కోల్పోయాం.

టార్గెట్ చిన్నది కావడంతోనే..

జోరూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వాస్తవానికి 240 పరుగులు అనేది చాలా చిన్న టార్గెట్. అదే మా స్కోర్ 300 ఉండి.. కావాల్సిన రన్‌రేట్ 5.5-6 ఉండి ఉంటే జోరూట్ ఒత్తిడికి లోనై తప్పుడు షాట్ ఆడేవాడు. కానీ ఓవర్‌కు 4.5-5 పరుగులే చేయాల్సి ఉండటంతో ఆచితూచి ఆడాడు. ఇలాంటి లక్ష్యాలను ఛేదించడంలో అతను దిట్ట. మేం అతను తప్పుడు షాట్ ఆడేలా చేయలేకపోయాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, July 17, 2026, 8:08 [IST]
Other articles published on Jul 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+