For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: యువ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత.!

Shubman Gill becomes youngest Indian opener to slam a Test fifty in Australia

సిడ్నీ: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో హాఫ్ సెంచరీ సాధించిన గిల్.. ఆసీస్ గడ్డపై 50 ప్లస్ స్కోర్ చేసిన అత్యంత పిన్న ఓపెనర్‌గా గుర్తింపుపొందాడు. ఆసియా బయట హాఫ్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఓపెనర్ల జాబితాలో శుభ్‌మన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అగ్రస్థానంలో ఉండగా.. మహదేవ్ అప్టే, పృథ్వీ షా, శుభ్‌మన్ తరువాతి స్థానంలో ఉన్నారు. 20 ఏళ్ల 44 రోజుల వయసులో రవిశాస్త్రి ఇంగ్లండ్‌పై 50కిపైగా పరుగులు చేయగా.. శుభ్‌మన్ 21 ఏళ్ల 122 రోజుల వయసుతో ఆసీస్‌పై హాఫ్ సెంచరీ చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.

భీకరమైన బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొన్న శుభ్‌మన్ 100 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాథన్ లయన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సంప్రదాయక ఫార్మాట్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఆ ఆనందం అతినికి ఎంతోసేపు నిలవలేదు. కమిన్స్ బౌలింగ్‌లో గల్లీలో డ్రైవ్ షాట్ ఆడబోయిన గిల్.. కామెరూన్ గ్రీన్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు.

166/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 45 ఓవర్లలో 2 వికెట్లకు 96 రన్స్ చేసింది. క్రీజులో చతేశ్వర్ పుజారా(9 బ్యాటింగ్), అజింక్యా రహానే (4) ఉన్నారు. శుభ్‌మన్ గిల్(50) హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించినా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ(26) తీవ్రంగా నిరాశపరిచాడు. హజెల్ వుడ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటికే కమిన్స్ శుభ్‌మన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

Story first published: Friday, January 8, 2021, 13:52 [IST]
Other articles published on Jan 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+