ICC Test Rankings: టాప్ లేపిన శుభ్‌మన్ గిల్!
ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాప్‌లేపాడు. అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్‌లో సెంచరీతో చెలరేగిన గిల్.. రెండు స్థానాలు ఎగబాకి 743 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి శుభ్‌మన్ గిల్ మాత్రమే టాప్ టెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.
అఫ్గానిస్థాన్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(126), కేఎల్ రాహుల్(100) సెంచరీలతో రాణించారు. ఈ మ్యాచ్‌లో విఫలమైన యశస్వి జైస్వాల్ 733 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 81 పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ఒక స్థానంపైకి ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు.

న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌లో విఫలమైన ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్(1,8) రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. 851 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 869 పాయింట్లతో వరల్డ్ నెంబర్ 1 టెస్ట్ బ్యాటర్‌గా ఎదిగాడు. లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్రూక్ 56 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ 853 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. రచిన్ రవీంద్ర నాలుగు స్థానాలు దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ మూడు స్థానాలు దిగజారి 7వ స్థానానికి పడిపోయాడు. మరోవైపు ఇంగ్లండ్‌కు చెందిన గస్ అట్కిన్సన్ ఏడు స్థానాలు ఎగబాకి టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అతను 5 వికెట్లు తీయడం గమనార్హం. ఇరు జట్ల మధ్య రెండో రెండో టెస్ట్ జూన్ 17న ప్రారంభంకానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications