Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill: జిడ్డు బ్యాటర్.. వద్దు బాబోయ్ అన్నారు! డబుల్ సెంచరీతో బల్లగుద్ది చెప్పాడు!

Shubman Gill answers critics with stunning Double century in Hyderabad ODI vs New Zealand

హైదరాబాద్: బంగ్లాదేశ్‌పై మెరుపు డబుల్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ కిషన్‌ను కాదని శుభ్‌మన్ గిల్‌ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తప్పుబట్టారు. జిడ్డు బ్యాటింగ్ చేసే శుభ్‌మన్ గిల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు సూట్ అవుతాడా? అని ప్రశ్నించారు. జట్టులో మరో కేఎల్ రాహుల్‌లా తయారవుతాడని, కీలక మ్యాచ్‌ల్లో చెతులెత్తేసి ఓటమికి కారణమవుతాడని విమర్శించారు. దూకుడుకు మారుపేరైన ఎంతోమంది కుర్రాళ్లుండగా శుభ్‌మన్ గిల్‌కే ఎందుకు వరుసగా అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. కానీ ఒక్క ఇన్నింగ్స్‌తో వీటన్నిటికీ బదులిచ్చాడు శుభ్‌మన్ గిల్.

తిట్టినవారే ప్రశంసిస్తున్నారు..

తిట్టినవారే ప్రశంసిస్తున్నారు..

ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్లంతా విఫలమైన వేళ ఒక్కడే కడవరకు నిలిచి అద్వితీయమైన బ్యాటింగ్‌తో అసాధ్యమైన డబుల్ సెంచరీని అందుకున్నాడు. అత్యంత పిన్న వయసులో ఈ ఘనతను అందుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. దాంతో శుభ్‌‌మన్ అవసరమా? అని ప్రశ్నించిన వారే ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. శ్రీలంకపై ఓ అర్ధశతకం, ఓ శతకంతో విమర్శకులకు బదులిచ్చిన శుభ్‌మన్‌.. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఏకంగా డబుల్‌ సెంచరీ బాదేసి ఔరా అనిపించాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ఓపెనర్‌ తనే అని ఈ ఇన్నింగ్స్‌తో అతను బల్లగుద్ది చెప్పాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో అతను చాలా ప్రశ్నలకు బదులిచ్చేశాడనే చెప్పాలి.

 హ్యాట్రిక్ సిక్స్‌లతో...

హ్యాట్రిక్ సిక్స్‌లతో...

సెంచరీ కొట్టిన వెంటనే డబుల్‌ సెంచరీ బాదడం అతడి సూపర్‌ ఫామ్‌కు, నిలకడకు రుజువైతే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు తగ్గట్లు వేగంగా ఆడలేడన్న విమర్శకు కూడా ఈ ఇన్నింగ్స్‌తోనే అతను సమాధానం చెప్పాడు. 150 నుంచి 200కు కేవలం 23 బంతుల్లోనే చేరుకోవడం.. డబుల్‌ సెంచరీ కష్టమనుకున్న దశలో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఆ మైలురాయిని చేరుకోవడం.. గిల్‌ దూకుడుకు నిదర్శనం. సంప్రదాయ షాట్లతోనే విధ్వంసం సృష్టించగలనని గిల్‌ ఉప్పల్‌లో చాటిచెప్పాడు. సిక్సర్‌తోనే హాఫ్ సెంచరీ, సెంచరీ(99), 150, డబుల్ సెంచరీ మార్క్ అందుకోవడం అతని భయం లేని ఆటకు నిదర్శనం. ఈ ఇన్నింగ్స్‌తో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

అండర్ 19 ప్రపంచకప్‌తో..

అండర్ 19 ప్రపంచకప్‌తో..

పంజాబ్ జిల్లా స్థాయి అండర్-16 పోటీల్లోనే 351 పరుగులు బాది అందర్నీ ఆశ్చర్యపరిచిన గిల్, విజయ్ మర్చంట్ ట్రోఫీలో డబుల్ సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. వరుసగా రెండేళ్లు బీసీసీఐ బెస్ట్ జూనియర్ క్రికెటర్ అవార్డు అందుకోవడంతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో అండర్-19 స్థాయిలో భారీ స్కోర్లు సాధిస్తూ.. 2018 అండర్-19 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. అప్పటి నుంచి గిల్‌కు ఎదురు లేకుండా పోయింది.

ఓపెనర్‌గా ఫిక్స్..

ఓపెనర్‌గా ఫిక్స్..

గత కొంత కాలంగా శిఖర్ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌ల వైఫల్యంతో ఓపెనింగ్‌ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న భారత్‌కు శుభ్‌మన్ గిల్‌ రూపంలో పరిష్కారం దొరికింది. ఇషాన్‌ కూడా సత్తా చాటుకున్నప్పటికీ.. అతనికి కూడా నిలకడ లేమి సమస్య ఉంది. ఇషాన్‌ కిషన్ కూడా కుదురుకుంటే ప్రపంచకప్‌ వరకు బ్యాటింగ్‌ ఆర్డర్లో దిగువన ఆడొచ్చు. ప్రపంచకప్‌ తర్వాత రోహిత్‌ తప్పుకుంటే శుభ్‌మన్‌కు జోడీగా ఓపెనర్‌గా స్థిరపడడానికి అవకాశముంటుంది.

Story first published: Thursday, January 19, 2023, 11:25 [IST]
Other articles published on Jan 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+