Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండేళ్ల చిన్నోడితో ప్రేమ.. సచిన్ బాటలోనే సారా టెండూల్కర్!

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్ తనయ సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయాణం నడుస్తుందని గత రెండేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరి వ్యవహార శైలి కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఈ ప్రేమాయణం వార్తలను ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ ఖండించలేదు. పేరు ప్రస్తావించకుండా శుభ్‌మన్ గిల్.. తనకు ఎలాంటి రిలేషన్ లేదని పలు ఇంటర్వ్యూల్లో తెలిపాడు. అయినా వీరిద్దరి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు ఆగలేదు.

అయితే వయసు రీత్యా సారా టెండూల్కర్ కంటే శుభ్‌మన్ గిల్ కంటే రెండేళ్లు చిన్నోడు. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ వయసు 25 ఏళ్లు కాగా.. సారా టెండూల్కర్ వయసు 27 ఏళ్లు. ఈ వయసు వ్యత్యాసం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సచిన్ టెండూల్కర్ కంటే అతని సతీమణి అంజలి కూడా రెండేళ్లు పెద్దది. సచిన్‌ది కూడా లవ్ మ్యారేజ్. దాంతో తండ్రి బాటలోనే సారా టెండూల్కర్ నడుస్తోందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Shubman Gill and Sara Tendulkar s 2-Year Age Gap Becomes Hot Topic Among Fans

సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ సోదరి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఈ ఇద్దరూ లేట్‌నైట్ పార్టీలకు హాజరవుతున్నారు. తాజాగా యువరాజ్ సింగ్ నిర్వహించిన చారిటీ కార్యక్రమానికి శుభ్‌మన్ గిల్‌తో పాటు సారా టెండూల్కర్ హాజరైంది. ఈ ఇద్దరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుసనే ప్రచారం కూడా ఉంది. అతి త్వరలోనే ఈ జంట అధికారికంగా తమ రిలేషన్‌ గురించి ప్రకటన చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ కెరీర్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టారు.

ఇటీవలే శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. మరోవైపు సారా టెండూల్కర్ మోడలింగ్‌పై ఫోకస్ పెట్టింది. ఇటీవలే ఆమె ఆస్ట్రేలియా అంతర్జాతీయ పర్యాటక ప్రచారానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ ప్రచారం కోసం ఆస్ట్రేలియా రూ. 1,140 కోట్లు ఖర్చు చేసింది. బ్రాండ్ అంబాసిడర్‌గా సారా భారీ వేతనాన్నే అందుకుంటుంది. మోడలింగ్ ద్వారా ఆమె ఏడాదికి రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తోంది. సచిన్ చారిటబుల్ ట్రస్ట్‌ను కూడా చూసుకుంటుంది. బ్రాండ్ అంబాసిడర్‌గా మారడంతో ఆమె నికర ఆస్తి పెరగనుంది. బాలీవుడ్‌లోకి కూడా సారా టెండూల్కర్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, August 13, 2025, 17:39 [IST]
Other articles published on Aug 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+