Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎంతసేపు జిడ్డు బ్యాటింగ్.. గిల్, సిరాజ్ స్లెడ్జింగ్!(వీడియో)

భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ బోరింగ్‌గా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తమ శైలికి భిన్నంగా ఆడుతోంది. బజ్‌బాల్ గేమ్‌తో దూకుడుగా ఆడే ఇంగ్లండ్.. భారత పేసర్ల ధాటికి జిడ్డు బ్యాటింగ్‌ చేస్తోంది. ఓవర్‌కు 5-6 పరుగులు చేసే ఇంగ్లండ్ 3.07 రన్ రేట్‌తో రాణిస్తోంది. దాంతో నెటిజన్లు బోరింగ్‌గా ఫీలవుతున్నారు.

భారత ఆటగాళ్లు కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు మహమ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ ఆటగాళ్లను ర్యాగింగ్ చేశారు. 'జిడ్డూ బ్యాటింగ్ ఎంత సేపు.. బాజ్ బాల్ ఎక్కడా'అంటూ స్లెడ్జింగ్‌కు దిగారు. 'వినోదాత్మక క్రికెట్ కనిపించడం లేదు. వెల్‌కమ్ బ్యాక్ టు బోరింగ్ టెస్ట్ క్రికెట్'అని శుభ్‌మన్ గిల్ అన్న కామెంట్స్ స్టంప్ మైక్‌‌లో రికార్డ్ అయ్యాయి. 'బజ్ బజ్ బజ్ బాల్.. నేను బజ్ బాల్ చూడాలి'అంటూ మహమ్మద్ సిరాజ్ కవ్వించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌‌గా మారాయి.

Shubman Gill And Mohammed Siraj Brutally Sledges England At Lord s Video Viral

బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 251 పరుగులు చేసింది. జో రూట్(191 బంతుల్లో 9 ఫోర్లతో 99 బ్యాటింగ్) ఇంగ్లండ్‌ను ఆదుకోగా.. బెన్ స్టోక్స్(39 బ్యాటింగ్) అండగా నిలిచాడు. ఓలీ పోప్(44) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీయగా.. జడేజా, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆట తొలి సెషన్‌లో భారత బౌలర్ల ఎలా రాణిస్తారన్నది మ్యాచ్ గమనాన్ని నిర్దేశించనుంది.

Story first published: Thursday, July 10, 2025, 21:40 [IST]
Other articles published on Jul 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+