Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AFG: కేఎల్ రాహుల్, గిల్ శతకం.. భారత్‌దే ఆధిపత్యం!

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో భారత బ్యాటర్లు దుమ్మురేపారు. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(165 బంతుల్లో 11 ఫోర్లతో 100), కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్(143 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 103 నాటౌట్)శతకాలతో కదం తొక్కారు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో 3 వికెట్లకు 368 పరుగుల భారీ స్కోర్ చేసింది.

క్రీజులో శుభ్‌మన్ గిల్‌తో పాటు రిషభ్ పంత్(70 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్) ఉన్నాడు. సాయి సుదర్శన్(104 బంతుల్లో 13 ఫోర్లతో 81) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. యశస్వి జైస్వాల్(24) విఫలమయ్యాడు. అఫ్గాన్ బౌలర్లలో మోహమ్మద్ సలీమ్(2/67) రెండు వికెట్లు తీయగా.. జియావుర్ రెహ్మాన్ ఒక వికెట్ పడగొట్టాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారత్ బ్యాటర్లు అలవోకగా పరుగులు రాబట్టారు. రెండో రోజు కూడా భారత్ పూర్తిగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.

IND vs AFG: SRH ఆటగాళ్లకు అన్యాయం!

IND vs AFG: SRH ఆటగాళ్లకు అన్యాయం!

అఫ్గాన్ ఘోర తప్పిదం..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆరంభించారు. కొత్త బంతితో బౌలర్లకు సహకారం లభించడంతో ఓపికగా ఆడారు. అయితే అఫ్గానిస్థాన్ ఘోర తప్పిదం కేఎల్ రాహుల్‌కు కలిసొచ్చింది. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ కీపర్ క్యాచ్ ఇవ్వగా.. అంపైర్లు ఔటివ్వలేదు. అఫ్గాన్ రివ్యూ తీసుకోలేదు. కానీ రిప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా తేలింది. ఈ అవకాశంతో రాహుల్ చెలరేగాడు.

IND vs AFG Shubman Gill and KL Rahul Hammer Stunning Centuries as India Dominate Afghanistan in Mullanpur Test

ఆ కాసేపటికే యశస్వి జైస్వాల్ ఔట్ అవ్వగా.. సాయి సుదర్శన్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సాయి సుదర్శన్ దూకుడుగా ఆడగా.. రాహుల్ తన క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో భారత్ 96/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రాహుల్, గిల్ శతకం..

రెండో సెషన్‌లోనూ ఈ జోడీ చెలరేగింది. అయితే ఈ ఇద్దర్నీ ఔట్ చేసే అవకాశాలు వచ్చినా అఫ్గాన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. దాంతో ఈ జోడీ చెలరేగింది. రాహుల్ 86 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. సాయి సుదర్శన్ 67 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ దిశగా సాగిన సాయి సుదర్శన్‌ను సలీమ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 139 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శుభ్‌మన్ గిల్ రాగా.. టీమిండియా 209/2 స్కోర్ వద్ద టీ బ్రేక్‌కు వెళ్లింది.

మూడో సెషన్‌లోనూ గిల్, రాహుల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. రాహుల్ 164 బంతుల్లో 12వ సెంచరీ పూర్తి చేసుకోగా.. గిల్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. రాహుల్‌ను జియావుర్ రెహ్మాన్ ఔట్ చేసి మూడో వికెట్‌కు నమోదైన 167 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. రిషభ్ పంత్‌తో కలిసి గిల్ చెలరేగాడు. ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టడంతో భారత స్కోర్ బోర్డు పరుగెత్తింది. 138 బంతుల్లో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేసుకోగా.. రిషభ్ పంత్ 70 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ వెంటనే అంపైర్లు తొలి రోజు ఆటకు ముగింపు పలికారు.

IND vs AFG: అఫ్గానిస్థాన్ ఘోర తప్పిదం!(వీడియో)

IND vs AFG: అఫ్గానిస్థాన్ ఘోర తప్పిదం!(వీడియో)
Story first published: Saturday, June 6, 2026, 18:05 [IST]
Other articles published on Jun 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+