Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంకతో రెండో టెస్ట్ గెలవకపోవడానికి గంభీరే కారణం.. ఆ విషయంలో శుభ్‌మన్ గిల్‌తో గొడవ!

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. శ్రీలంకతో రెండో టెస్ట్ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసే విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

శ్రేయస్ అయ్యర్‌కు చెక్.. గంభీర్ బిగ్ ప్లాన్!

శ్రేయస్ అయ్యర్‌కు చెక్.. గంభీర్ బిగ్ ప్లాన్!

గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఈ మ్యాచ్‌ను భారత్ గెలవలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గంభీర్ పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదని, ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకున్నాడని ఓ నివేదిక పేర్కొంది. ఈ అభిప్రాయ భేదాలే శ్రీలంకతో రెండో టెస్ట్‌లో భారత్ విజయవకాశాలను దెబ్బతీసినట్లు తెలిపింది.

Shubman Gill and Gautam Gambhir Rift Reports Surface After Colombo Test Draw Against Sri Lanka

డిక్లేర్ విషయంలో గొడవ..

కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ రెండో రోజు ఆటలో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని శుభ్‌మన్ గిల్ భావించాడట. కానీ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ సెంచరీ చేసేందుకు వీలుగా గంభీర్ మ్యాచ్ డిక్లేర్ చేయకుండా అడ్డుకున్నాడని, దాంతో భారత్ ఇన్నింగ్స్‌ మరింత పొడిగించాల్సి వచ్చిందని సదరు రిపోర్ట్ పేర్కొంది. చివరకు భారత్ 503/9 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో శ్రీలంకను ఓడించేందుకు భారత్‌కు చాలా తక్కువ సమయం మిగిలిందని, ఆఖరి రోజు సోనాల్ దినూష్ అజేయ శతకంతో చెలరేగడంతో విజయం సాధించలేకపోయిందని ప్రచారం జరుగుతోంది.

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. తమ నిర్ణయాలను సమర్థించుకున్నాడు. అప్పటి పరిస్థితుల ఆధారంగానే డిక్లేర్, ఫాలో-ఆన్ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పాడు. 'మేం మైదానంలో మూడు రోజుల పాటు ఫీల్డింగ్ చేశాం. విజయం కోసం చేయగలిగినదంతా చేశాం. పరిస్థితులను బట్టి మేం ఉత్తమ నిర్ణయం తీసుకున్నాం.'అని తెలిపాడు.

ఫాలో-ఆన్ నిర్ణయం వల్ల కాదు.. వారి వల్లే విజయం దక్కలేదు: శుభ్‌మన్ గిల్

Also Read

ఫాలో-ఆన్ నిర్ణయం వల్ల కాదు.. వారి వల్లే విజయం దక్కలేదు: శుభ్‌మన్ గిల్

గంభీర్‌ పెత్తనంపై విమర్శలు..

కానీ జట్టుపై గంభీర్ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నాడనే ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. హెడ్ కోచ్, కెప్టెన్ మధ్య సయోధ్య లేకపోతే జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంభీర్-గిల్ మధ్య విభేదాలు అనే అంశం సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. గంభీర్ కోచింగ్ శైలిని వ్యతిరేకిస్తూ పలువురు సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కెప్టెన్‌కు కూడా స్వేచ్ఛ లేదనే వాదనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Story first published: Tuesday, September 1, 2026, 9:34 [IST]
Other articles published on Sep 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+