For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ తప్పిదమే మా ఓటమిని శాసించింది: శుభ్‌మన్ గిల్

మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం తమ ఓటమిని శాసించిందని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయనప్పుడు అదనంగా 15-20 పరుగులు చేసినా లాభం ఉండదన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 285 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది.

చెత్త బౌలింగ్..

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. 'మేం మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం మా ఓటమిని శాసించింది. సర్కిల్‌లో ఐదుగురు ఫీల్డర్లు ఉన్నప్పుడు వికెట్లు తీయకపోతే మ్యాచ్ గెలవడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ మేం 15-20 పరుగులు అదనంగా చేసినా ఓడిపోయేవాళ్లం. క్రీజులో సెట్ అయిన బ్యాటర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాల్సింది.

Shubman Gill Admits Middle-Overs Bowling Cost India After Defeat to New Zealand in 2nd ODI

బౌలింగ్‌లో మాకు మంచి ఆరంభమే లభించింది. కానీ వారు మిడిల్ ఓవర్లలో చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మేం బౌలింగ్ చేసిన మొదటి 10-15 ఓవర్లలో బంతి బాగానే స్పందించింది. ఆ తర్వాత వికెట్ సెట్ అయ్యింది. కానీ మేం మరింత మెరుగ్గా ఆడి మరిన్ని అవకాశాలను సృష్టించాల్సింది. గత మ్యాచ్‌లో మేం కొన్ని క్యాచ్‌లను నేలపాలు చేశాం. కానీ ఈ మ్యాచ్‌ల్లో మెరుగ్గానే రాణించాం. ఫీల్డింగ్‌లో మెరుగవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అవకాశాలను అందుకోకపోతే మ్యాచ్‌లను గెలవలేం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

డారిల్ మిచెల్ విధ్వంసం..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 284 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్( 92 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. శుభ్‌మన్ గిల్(53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టియన్ క్లార్క్(3/56) మూడు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, జాక్ ఫోక్స్, జైడన్ క్లార్క్, మైఖేల్ బ్రెస్‌వెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం న్యూజిలాండ్ 47.3 ఓవర్లలో 3 వికెట్లకు 286 పరుగులు చేసి గెలుపొందింది. డారిల్ మిచెల్(117 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 131 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. గ్లేన్ ఫిలిప్స్(24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

Story first published: Wednesday, January 14, 2026, 22:15 [IST]
Other articles published on Jan 14, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+