Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అవి నరం లేని నాలుకలు.. పట్టించుకోవద్దు: శ్రేయస్ అయ్యర్

బయటి వ్యక్తుల విమర్శలను అస్సలు పట్టించుకోవద్దని తన సహచర ఆటగాళ్లకు టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూచించాడు. అవి నరం లేని నాలుకలని, ఏవైనా మాట్లాడుతాయని తెలిపాడు. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నిర్భయంగా ఆడాలని కోరాడు.

పసికూన ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ల్లో టీమిండియా ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. వరుసగా 7 మ్యాచ్‌‌ల్లో 6 పరాజయాలను చవిచూసింది. దాంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లింది.

Shreyas Iyer Urges Squad to Ignore the Out Side Noise after India s disappointing Performance in England
Photo Credit: X (twitter)

గురువారం జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడాడు. గత సిరీస్‌ల్లో ఫలితాలు అనుకూలంగా లేకున్నా.. ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని చెప్పాడు.

నాకు అచ్చొచ్చిన మైదానం.. నా సత్తా చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ

నాకు అచ్చొచ్చిన మైదానం.. నా సత్తా చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ

'ఇంగ్లండ్ పర్యటనలో మేం కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాం. భవిష్యత్తులో ఒక జట్టుగా ఎలా ఉండాలి? ఏం చేయాలి? మైదానంలో ఎలా వ్యవహరించాలి? అనే విషయాలను తెలుసుకున్నాం. మా జట్టులో కొందరు ఇక్కడ తొలిసారి ఆడుతున్నారు. కాబట్టి మేం పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.

ఆటగాళ్లు ఎవరూ వైఫల్యాల గురించి భయపడొద్దు. ఎందుకంటే అలాంటి ఆలోచనలు మనసులో ఉంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఆడుతారు. మీకు ఆ భయం లేనప్పుడే మీలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది.

అతనిలాంటి ఆటగాడిని చూడలేదు.. చెప్పి మరి సిక్స్ కొట్టాడు: హర్భజన్ సింగ్

అతనిలాంటి ఆటగాడిని చూడలేదు.. చెప్పి మరి సిక్స్ కొట్టాడు: హర్భజన్ సింగ్

బయట జనాలు ఏమంటున్నారనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అవి నరం లేని నాలుకలు ఏమైనా మాట్లాడుతాయి. ప్రస్తుత కాలంలో ఉండాలి. జట్టుగా సమష్టిగా రాణించే ప్రయత్నం చేయాలి. ఎంత మంచి క్రికెట్ ఆడితే అదే స్థాయిలో ఫలితం వస్తుంది. మేం ఇంగ్లండ్ నుంచి మంగళవారమే ఇక్కడికి వచ్చాం.

ఈ రోజు ప్రాక్టీస్ సెషన్. రేపు మ్యాచ్. ఇది మాకు సవాల్‌తో కూడుకున్నదే. ఇలాంటి పరిస్థితుల్లో రాణిస్తే ఆ అనుభూతి చాలా బాగుంటుంది. గత సిరీస్‌ల్లో మాకు పరాజయాలు ఎదురయ్యాయి. కానీ, ఆ ఓటములు జట్టు సభ్యులను మరింత దగ్గరకు చేశాయి. జట్టుగా ఎలా ఆడాలనే దానిపై చర్చలు జరుపుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Wednesday, July 22, 2026, 21:50 [IST]
Other articles published on Jul 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+