IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయస్ అయ్యర్ గుడ్‌బై!

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఆ ఫ్రాంచైజీకీ గుడ్‌బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కొనసాగేందుకు అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీగ్‌లోకి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడంతో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. దాంతో వేలంలోకి వెళ్లాలని అయ్యర్ భావిస్తున్నాడట. 2015లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన అయ్యర్.. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో కీలక ఆటగాడిగా ఎదిగాడు. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా జట్టుకు ఎన్నో విజయాలందించాడు.
2018 సీజన్‌లో గౌతమ్ గంభీర్ మధ్యలోనే తప్పుకోవడంతో ఢిల్లీ పగ్గాలు అందుకున్న అయ్యర్.. జట్టును రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేర్చాడు. అతని సారథ్యంలోనే గతేడాది ఫైనల్ చేరిన ఢిల్లీ.. తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

గాయంతో దూరమై..
ఇక ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందుకు భుజ గాయానికి గురైన అయ్యర్.. భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్ లీగ్‌కు దూరమయ్యాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రిషభ్ పంత్ నడిపించాడు. అయితే కరోనాతో లీగ్ వాయిదాపడటంతో సెకండాఫ్ లీగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. ఆటగాడిగానే కొనసాగాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌నే కొనసాగించింది. ఈ నిర్ణయాన్ని అయ్యర్ సైతం సమర్థించాడు. టీమ్‌మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తానని చెప్పాడు. ఫస్టాఫ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను పంత్ అద్భుతంగా నడిపించాడని చెప్పుకొచ్చాడు.

ఫుల్ డిమాండ్..
అయితే ఐపీఎల్ 2022 మెగావేలం నేపథ్యంలో అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడేందుకు సిద్దమవుతున్నాడని టైమ్స్ ఇండియా పేర్కొంది. లీగ్‌లో కెప్టెన్‌గా కొనసాగేందుకే అయ్యర్ ప్రయత్నాలు చేస్తున్నాడని, కొత్తగా రెండు జట్లు రావడంతో వేలంలోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడని తమ కథనంలో రాసుకొచ్చింది. ఇక కొత్తగా వచ్చిన జట్లతో పాటు పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు కెప్టెన్ వేటలో ఉన్నాయి. ఈ క్రమంలో సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన అయ్యర్‌కు మంచి డిమాండ్ ఉండనుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా భారత జట్టుతో ఉన్న అయ్యర్.. స్టాండ్ బై ప్లేయర్‌గా టీమ్‌కు సేవలందిస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. అక్కడ మెరుపులు మెరిపిస్తే వేలంలో అయ్యర్‌పై కనకవర్షం కురువనుంది.

నలుగురికి చాన్స్..
ప్రస్తుతానికి మెగావేలం తేదీలను ఖారారు చేయకపోయినప్పటికీ ఆటగాళ్ల రిటెన్షన్‌పై బోర్డు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పాలసీ ప్రకారం మెగా వేలానికి ముందు పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక ఓవర్ సీస్ ప్లేయర్ లేదా ఇద్దరు భారత ప్లేయర్లు.. ఇద్దరు ఓవర్ సీస్ ప్లేయర్లను ఎంచుకోవచ్చు. ఇక భారత ఆటగాళ్ల విషయంలో క్యాప్, అన్ క్యాప్ ప్లేయర్లా? అనేది ఫ్రాంచైజీల ఇష్టం. మొత్తం క్యాప్ ప్లేయర్లను లేదా అన్ క్యాప్ ప్లేయర్లను, కలిపి కూడా తీసుకోవచ్చు.

కొత్త టీమ్స్ ముగ్గుర్నే..
ఇక కొత్తగా వచ్చిన రెండు జట్లు మాత్రం పాత జట్లు వదిలేసిన ఆటగాళ్లు, మెగా వేలానికి అందుబాటులో ఉన్న ప్లేయర్ల పూల్ నుంచి నేరుగా ముగ్గురిని ఎంచుకోవచ్చు. ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపి ఈ ముగ్గురిని నియమించుకునే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ ముగిసిన తర్వాతే మిగిలిన ఆటగాళ్లతో మెగా వేలం జరగనుంది. ఇప్పటికే ఈ రిటెన్షన్ పాలసీ గురించి ఫ్రాంచైజీలతో ఐపీఎల్ నిర్వాహకులు చర్చలు జరపారని సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే బీసీసీఐ ఈ పాలసీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని బోర్డుకు చెందిన ఓ అధికారి తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications