For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shreyas Iyer గోల్డెన్ బాల్.. ఆ సన్‌గ్లాసెస్‌తోనే కళ్లు చెదిరే బౌలింగ్!(వీడియో)

టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌ గోల్డెన్ బాల్‌తో దుమ్మురేపాడు. దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డీకి సారథిగా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్.. స్టన్నింగ్ బౌలింగ్‌తో పాటు క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. ఇండియా-ఏ రెండో ఇన్నింగ్స్‌లో వేసిన తొలి బంతికే ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌(87 బంతుల్లో 8 ఫోర్లతో 56)ను స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.

ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వేసిన ఫస్ట్ బాల్‌కే వికెట్ తీయడంతో గోల్డెన్ బాల్ అంటూ నెటిజన్లు శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సన్‌గ్లాసెస్‌తో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. దాంతో అతను తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు.

Shreyas Iyer Takes A Wicket On His First Ball wearing sunglasses In Duleep Trophy 2024

ఇప్పుడు అదే సన్‌గ్లాసెస్‌తో బౌలింగ్ చేసి తొలి బంతికే వికెట్ అందుకున్నాడు. దాంతో శ్రేయస్ అయ్యర్‌పై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ బౌలింగ్‌తో తొలి వికెట్‌కు నమోదైన 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడటంతో పాటు రెండో రోజు ఆట ముగిసింది. క్రీజులో ప్రథమ్ సింగ్(59 బ్యాటింగ్) ఉన్నాడు.

అంతకుముందు 288/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇండియా-ఏ మరో రెండు పరుగులు మాత్రమే జోడించి 290 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. షామ్స్ ములాని(89), తనూష్ కొటియాన్(53)లు హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇండియా డీ బౌలర్లలో హర్షిత్ రాణా(4/51) నాలుగు వికెట్లు తీయగా.. కావేరప్ప, అర్ష్‌దీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఇండియా-డీ 183 పరుగులకు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(124 బంతుల్లో 15 ఫోర్లతో 92) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(3/39), ఆఖిబ్ ఖాన్(3/41) మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిధ్ కృష్ణ, తనూష్ కోటియన్, షామ్స్ ములాని తలో వికెట్ తీసారు. దాంతో ఇండియా-ఏకు 107 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

Story first published: Friday, September 13, 2024, 19:23 [IST]
Other articles published on Sep 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+