ఏదో ఒక రోజు టీమిండియా కెప్టెన్ అవుతా : శ్రేయస్

న్యూఢిల్లీ: భవిష్యత్తులో కెప్టెన్ అవుతనని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతానికైతే ఆలోచన లేదని కానీ.. ఎదో ఒక రోజు భారత జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాననే నమ్మకం ఉందన్నాడు. క్రిక్‌బజ్ స్పైసీ పిచ్ కార్యక్రమంలో భాగంగా అయ్యర్ మాట్లాడుతూ.. తనకు భారత జట్టులో అవకాశం వచ్చినప్పుడు పెద్దగా ఎమోషనల్ ఏమీ కాలేదని, తనకు ఎప్పుడో అవకాశం వస్తుందని ఆశించానని, ఆలస్యంగానైనా అవకాశం వచ్చిందన్నాడు. అయితే తన ఆట మెరుగవ్వడానికి టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కారణమని ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చెప్పుకొచ్చాడు.

అలా ద్రవిడ్ సార్ దృష్టిలో పడ్డా..
‘నా బ్యాటింగ్‌ను ఒకరోజు రాహుల్ ద్రవిడ్ సర్ చూశారు. అది నాలుగు రోజుల క్రికెట్ మ్యాచ్. తొలి రోజు చివరి ఓవర్‌లో నా ఆటను ద్రవిడ్ సర్ నిశితంగా పరిశీలించారు. అప్పటికి నేను సుమారు 30 పరుగులు చేసి ఉన్నా. అది చివరి ఓవర్ కావడంతో నిదానంగా ఆడాలి. కానీ నేను బౌలర్‌ను ఊరిస్తూ బ్యాట్‌పైకి వేసిన బంతిని సిక్స్ కొట్టా. ఆ సమయంలో అది అవసరం లేదు. అలా ద్రవిడ్ సర్ దృష్టిలో పడ్డా' అని అయ్యర్ తెలిపాడు.

భవిష్యత్తులో కెప్టెనవుతా..
గత ఐపీఎల్ సీజన్‌లో అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న అయ్యర్.. తన అద్భుత కెప్టెన్సీతో జట్టును మూడో స్థానంలో నిలిపాడు. 2012 నుంచి ఢిల్లీ క్వాలిఫైయర్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. దీంతో అతని కెప్టెన్సీపై ప్రశంసల జల్లు కురిసింది. ఈ నేపథ్యంలోనే మీకు టీమిండియాకు కెప్టెన్‌గా చేయాలని ఉందా? అనే ప్రశ్నకు అయ్యర్ అవుననే సమాధానమిచ్చాడు. ‘భవిష్యత్తులో ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ అవుతాను. ప్రస్తుతానికి నాకు ఆ ఆలోచన లేకపోయినా, భవిష్యత్తులో ఆ అవకాశం లభిస్తుంది. అయితే దాని గురించి ఇప్పట్నుంచే పెద్దగా ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా ఆటను ఆస్వాదించడంపైనే దృష్టిసారించా.'అని అయ్యర్ తెలిపాడు.
జనం చస్తుంటే ఈ వంటకాలేంది.. సెలబ్రిటీలపై సానియా ఫైర్

మిడిలార్డర్ మొనగాడు...
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ నిష్క్రణకు కారణం నాలుగో స్థానంలో రాణించే ఆటగాడు లేకపోవడమే. యువరాజ్ సింగ్ అనంతరం ఆ స్థానంలో ఆ స్థాయిలో ఆడే మరే ఆటగాడు భారత్‌కు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఆటగాళ్లను మార్చి మార్చి అవకాశాలు ఇచ్చిన టీమిండియాను ఈ సమస్య తీవ్రంగా వేదించింది. అయితే ప్రపంచకప్ అనంతరం అయ్యర్ రూపంలో భారత జట్టుకు ఈ సమస్య తీరింది. ఇప్పటివరకూ అయ్యర్ 18 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. అయితే 40 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న అయ్యర్ 3,4,5,6 స్థానాల్లో బ్యాటింగ్ చేశాడు. కాగా, నాల్గో స్థానంలోనే అతని సగటు మెరుగ్గా ఉందనే విషయం అతని గణాంకాలే చెబుతున్నాయి. ఇక్కడ అయ్యర్ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 56.00 సగటుతో 396 పరుగులు చేసి ఈ స్థానానికి తనే సరైనవాడినని నిరూపించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications