Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy: శ్రేయస్ అయ్యర్ బలుపు! (వీడియో)

టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యర్‌కు ఇంత బలుపా? అంటూ కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు అతను ఆడిన ఆటకు ఆ మాత్రం బలుపు ఉండాల్సిందేనని అండగా నిలుస్తున్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025‌లో అయ్యర్ అసాధారణ బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. టాప్ బ్యాటర్లు ఔటైన వేళ అయ్యర్ జట్టును తనదైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. తన లోపాన్ని బలంగా మార్చుకొని.. జట్టు పడిపోతున్న ప్రతీసారి నేనుంటానని నమ్మకాన్ని కలిగించాడు. 2 హాఫ్ సెంచరీలు.. రెండు 40 ప్లస్ స్కోర్లతో మొత్తం 5 ఇన్నింగ్స్‌ల్లో 243 పరుగులు చేశాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలోనే భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

Shreyas Iyer showed attitude to BCCI president after India s Champions Trophy win

ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో అతను ఆడిన 48 పరుగుల ఇన్నింగ్స్‌ టీమిండియా విజయానికి వెన్నుముకగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా అయ్యర్‌కే దక్కాల్సిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. టీమిండియా ఎక్స్‌ఫ్యాక్టర్ అతనేనని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అయితే విజయానంతరం ఐసీసీ ఛైర్మన్ జైషా మెడల్స్ ప్రధానం చేయగా.. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ భారత ఆటగాళ్లకు వైట్ జాకెట్స్ తొడిగాడు. ఈ వైట్ జాకెట్స్ స్వీకరించడానికి వరుణ్ చక్రవర్తీ ముందు వచ్చాడు. ఆ తర్వాత ఒక్కో ప్లేయర్ రాగా.. బీసీసీఐ ప్రెసిడెంట్ స్వయంగా ఆటగాళ్లకు జాకెట్స్ తొడిగాడు. అయ్యర్ మాత్రం బీసీసీఐ బాస్ చేతి జాకెట్ తొడిగించడానికి నిరాకరించాడు. బీసీసీఐ పెద్దల ముందు కాస్త యాటిట్యూడ్ చూపించాడు. దాంతో బిన్నీ జాకెట్‌ను అయ్యర్ భుజాలపై కప్పగా.. అతను ముందుకొచ్చి వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. బీసీసీఐ పెద్దల ముందు అయ్యర్ తన బలుపు చూపించాడని, ఈ ఎక్స్‌ట్రాలే తగ్గించుకోవాలని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం.. తనకు అన్యాయం చేసిన బీసీసీఐ ముందు ఆ మాత్రం బలుపు చూపించాల్సిందేనని కామెంట్ చేస్తున్నారు.

దేశవాళీ క్రికెట్ ఆడాలనే బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడని సెంట్రల్ కాంట్రాక్ట్‌ల నుంచి శ్రేయస్ అయ్యర్‌ను తొలగించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత జట్టుకు కూడా దూరంగా ఉంచారు. దాంతో అయ్యర్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణించి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అసాధారణ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్వశక్తితో పైకి వచ్చిన ఎవరికైనా బలుపు ఉంటుందని అయ్యర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, March 11, 2025, 13:31 [IST]
Other articles published on Mar 11, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+