Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదేందయ్యో ఇది.. చహల్ భార్యతో శ్రేయస్‌ అయ్యర్‌..!! వీడియో చూస్తే షాకే!!

Shreyas Iyer shakes a leg with Yuzvendra Chahals wife Dhanashree Verma

చెన్నై: టీమిండియా మణికట్టు స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్ యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో గురుగ్రామ్‌లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఘనంగా జరిగింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లలో చహల్‌కు చోటు దక్కకపోవడంతో ఈ కొత్త జంట సరాదాగా టూర్‌లకు వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా ధనశ్రీ డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె కొరియోగ్రాఫర్‌ కాబట్టి డాన్స్ చేయడంలో కొత్తేముంది అనుకుంటుంన్నారా?. ధనశ్రీతో డాన్స్ చేసింది టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌.

ధనశ్రీతో కలిసి శ్రేయస్‌ స్టెప్పులు:

ధనశ్రీతో కలిసి శ్రేయస్‌ స్టెప్పులు:

స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్ సతీమణి ధనశ్రీ వర్మతో కలిసి శ్రేయస్‌ అయ్యర్‌ తాజాగా అదిరే స్టెప్పులు వేశాడు. 'రోసెస్' సాంగ్‌కు ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లా స్టెప్పులు ఇరగదీశాడు. ఇంకా చెప్పాలంటే.. కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీ కంటే కూడా బాగా వేశాడు. ఇద్దరూ కలిసి కాళ్లతో వేసిన స్టెప్పులు వావ్ అనిపిస్తున్నాయి. చివరికి ధనశ్రీ ఆగిపోగా.. శ్రేయస్‌ మాత్రం డాన్స్ వేస్తూనే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను శ్రేయస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'మా పాదాల వైపు చూస్తున్నారా?' అని శ్రేయస్‌ ఆ వీడియోకు వ్యాఖ్య జత చేశాడు.

 శ్రేయస్‌.. ఇరగదీశావ్:

శ్రేయస్‌.. ఇరగదీశావ్:

శ్రేయస్‌ అయ్యర్, ధనశ్రీ వర్మ డాన్స్ చేసిన వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే 5 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. టీమిండియా ఆటగాళ్లు చహల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, హార్దిక్ పాండ్యా‌, కృనాల్ పాండ్యా కూడా శ్రేయస్‌ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించారు. 'శ్రేయస్‌.. ఇరగదీశావ్. కానీ ఎలా?' అని కామెంట్లు చేశారు. వీడియోను పరిశీలిస్తే.. శ్రేయస్‌, ధనశ్రీ జిమ్‌లో డాన్స్ చేసినట్టు అనిపిస్తోంది. ఇక ధనశ్రీ యూట్యూబర్‌గా సోషల్ మీడియాలో చాలా ఫేమస్‌. అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్‌ వేస్తూనెట్టింట తరచూ ఆమె వీడియోలు పోస్ట్‌ చేస్తుంటారు.

 ధనశ్రీకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు:

ధనశ్రీకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు:

ముంబైలో జన్మించిన ధనశ్రీ వర్మ మంచి డ్యాన్సర్, కొరియోగ్రాఫర్. అంతేకాకుండా తాను ఓ యూట్యూబ్ ఛానల్‌ని సైతం నడుపుతున్నారు. ఆమె తండ్రి సాగర్ వర్మ వ్యాపార వేత్త. తల్లి వర్ష వర్మ డెంటిస్ట్‌. దీంతో తొలుత డాక్టర్ కావాలని ఆశపడిన ధనశ్రీ.. ఆ తర్వాత డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమెకి పెద్ద సంఖ్యలోనే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె పోస్ట్ చేసిన వీడియో నిమిషాల్లోనే వైరల్ అవుతుంది.

కెప్టెన్‌గా శ్రేయస్‌:

యుజువేంద్ర చహల్, శ్రేయస్‌ అయ్యర్ ఇద్దరూ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లలో ఆడట్లేదు. మార్చి 12 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్, మార్చి 23 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. ఆ సిరీస్‌లలో చహల్, శ్రేయస్‌ ఆడనున్నారు. ఇక భుజం గాయం కారణంగా ఇటీవల ముగిసిన సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో శ్రేయస్‌ ఆడలేదు. అయితే ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం అతడు ఆడనున్నాడు. అంతేకాదు ముంబై జట్టు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. భారత ఓపెనర్ పృథ్వీ షాను ముంబై జట్టు వైస్ కెప్టెన్‌గా నియమించారు.

India vs England: ఎస్‌జీ బంతి, పిచ్‌, టాస్‌ అని ఓటమిపై సాకులు చెప్పొద్దు: బేడి ఫైర్

Story first published: Wednesday, February 10, 2021, 20:18 [IST]
Other articles published on Feb 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+