Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: ఎస్‌జీ బంతి, పిచ్‌, టాస్‌ అని ఓటమిపై సాకులు చెప్పొద్దు: బేడి ఫైర్

Bishan Singh Bedi slams Virat Kohli over post match comments

ముంబై: చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలవ్వడంపై భారత మాజీ లెఫ్టామ్ స్పిన్న‌ర్ బిష‌న్ సింగ్ బేడీ ఫైర్ అయ్యారు. ఎస్‌జీ బంతి, పిచ్‌, టాస్‌ వంటి కారణాలు చెప్పకుండా.. ఓటమిపై పునఃసమీక్షించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీకి సూచించారు. మంగళవారం ముగిసిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 420 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. జేమ్స్ అండర్సర్‌ 3/17, జాక్ లీచ్‌ 4/76‌ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

సాకులు చెప్పొద్దు:

బుధవారం ఉదయం ట్విటర్ వేదికగా టీమిండియా ఓటమిపై బిష‌న్ సింగ్ బేడీ స్పందించారు. 'నిన్న మ్యాచ్‌ను చూడలేకపోయాను. అయితే విజయం సాదించేందుకు ఇరు జట్లకూ అవకాశముంటుంది. కానీ ఎస్‌జీ బంతి, వికెట్, టాస్‌ అంటూ ఓటమిపై సాకులు చెప్పకూడదు. ఇంగ్లండ్‌ జట్టును అభినందించినట్లుగానే.. ఓటమిపై పునఃసమీక్షించుకోవాలి. ప్రత్యర్థి జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు' అని బేడీ ట్వీట్ చేశారు. బిష‌న్ బేడీ భారత్ తరఫున 67 టెస్టులు, 10 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 266, వన్డేల్లో 7 వికెట్లు పడగొట్టారు.

 ఎస్‌జీ బంతులపై కోహ్లీ అసంతృప్తి:

ఎస్‌జీ బంతులపై కోహ్లీ అసంతృప్తి:

మ్యాచ్‌ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఎస్‌జీ బంతులపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి నాణ్యత సంతృప్తికరంగా లేదు, గతంలోనూ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నామన్నాడు. మ్యాచ్‌లో టాస్‌ కీలకమే కానీ ఇంగ్లండ్‌ ఘనతను ఏమాత్రం తగ్గించాలనుకోట్లేదని పేర్కొన్నాడు. ఓటమిపై సాకులు చెప్పమని, జట్టు వైఫల్యాల్ని అంగీకరిస్తున్నామని కోహ్లీ తెలిపాడు. ఈ వ్యాఖ్యలపైనే బిష‌న్ సింగ్ బేడీ స్పందించారు. సాకులు చెప్పకుండా.. ఓటమిపై పునఃసమీక్షించాలన్నారు.

సెల‌క్ట‌ర్లు ఆ ధైర్యం చేయ‌లేరు:

సెల‌క్ట‌ర్లు ఆ ధైర్యం చేయ‌లేరు:

ఆస్ట్రేలియాలో చారిత్ర‌క విజ‌యం సాధించిన త‌ర్వాత అజింక్య ర‌హానేకు కెప్టెన్సీ ఇవ్వాల‌న్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బిష‌న్ సింగ్ బేడీ కూడా ర‌హానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలని ఇప్పటికే అభిప్రాయపడ్డారు. ఇండియ‌న్ టీమ్‌కు విరాట్ కోహ్లీలోని ఓ సాదాసీదా కెప్టెన్ కావాలా లేక గ్రేట్ బ్యాట్స్‌మ‌న్ కావాలో తేల్చుకోవాల‌న్నారు. టెస్టుల్లో ర‌హానే.. వ‌న్డేలు, టీ20ల‌కు కోహ్లీ, రోహిత్‌లు కెప్టెన్సీలు చేప‌డితే బాగుంటుంద‌న్నారు. అయితే బీసీసీఐ సెల‌క్ట‌ర్లు ఈ ధైర్యం చేయ‌లేర‌ని బిష‌న్ బేడీ స్పష్టం చేశారు.

ఒకే ఒక్కసారే ఇంగ్లండ్‌ను ఓడించింది:

ఒకే ఒక్కసారే ఇంగ్లండ్‌ను ఓడించింది:

మొదటి మ్యాచులో ఓడిపోయిన తర్వాత సిరీస్‌ గెలిచిన రికార్డును ఓసారి పరిశీలిస్తే.. ఇంగ్లండ్‌పై భారత్‌ ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని తెలుస్తుంది. ఇప్పటివరకు టెస్ట్‌ చరిత్రలో ఇంగ్లండ్‌ 14 సార్లు సిరీస్‌లను కైవసం చేసుకున్నది. ఇదే సమయంలో తొలి టెస్ట్‌లో ఓటమి అనంతరం భారత్‌ ఐదు సార్లు సిరీస్‌ను గెలుచుకున్నది. అదికూడా టీమిండియా ఒకే ఒక్కసారే ఇంగ్లండ్‌ను ఓడించింది. 48 సంవత్సరాల క్రితం (1972-73) హోమ్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకున్నది.

అందుకే కోహ్లీ కెప్టెన్సీని ప్రేమిస్తున్నా.. రెండో టెస్టు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా: జమైకా స్ప్రింటర్‌

Story first published: Wednesday, February 10, 2021, 18:55 [IST]
Other articles published on Feb 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+