Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సూర్యకుమార్ యాదవ్‌పై వేటు.. అతనే టీమిండియా నయా టీ20 కెప్టెన్‌!

పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌‌పై భారత సెలెక్టర్లు వేటు వేసినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 గెలిచినా అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించేందుకు అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

గతేడాదిగా సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దాంతోనే జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని ఓ అధికారి మీడియాకు తెలిపారు. అప్‌కమింగ్‌ సిరీస్‌ల్లోనూ అతనికి చోటు దక్కే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Shreyas Iyer Set to Replace Suryakumar Yadav as India s New T20I Skipper Ahead of Ireland Tour Reports

'సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐ నిర్ణయించింది. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ సారథ్య బాధ్యతలు చేపడుతాడు. ఐర్లాండ్‌, ఇంగ్లండ్తో జరిగే టీ20 సిరీస్‌ల్లో టీమిండియాను శ్రేయస్ అయ్యర్ నడిపిస్తాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ ఆడిన నాలుగో నంబర్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగుతాడు. యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించనున్నారు. టీ20 ప్రపంచకప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్‌ను ఈసారి పరిగణనలోకి తీసుకోలేదు.

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. సంజు శాంసన్‌ను కెప్టెన్‌ను చేయాలని కోరాడు. కానీ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ అందుకు అంగీకరించలేదు. సంజూ బ్యాటింగ్‌లో నిలకడ లేదని సాకుగా చూపారు.

ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినప్పటికీ.. సంజూను కెప్టెన్ చేసేందుకు అంగీకరించలేదు. చివరికి శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా.. తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించడానికి అందరూ అంగీకరించారు. ఈ చర్చల్లో రజత్ పటీదార్ పేరు ప్రస్తావనకు రాలేదు.’అని సదరు అధికారి వెల్లడించాడు.

ప్రస్తుతం వన్డే జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్.. 2023 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై చివరి టీ20 ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్లను ఫైనల్‌కు చేర్చిన ఘనత శ్రేయస్ అయ్యర్‌కు ఉంది. ఐపీఎల్ 2024‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు సారథిగా కొనసాగుతున్నాడు. తాజా సీజన్‌లో అయ్యర్ 14 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 5 అర్ధసెంచరీలతో 498 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

Story first published: Thursday, June 4, 2026, 10:54 [IST]
Other articles published on Jun 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+