IPL 2026: శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్!
పంజాబ్ కింగ్స్(PBKS) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ ప్రమోషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ అటు కెప్టెన్‌గా.. ఇటు ఆటగాడిగా అద్భుత ప్రదర్శన కనబరుస్తుండటంతో టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు మీడియాకు తెలిపాయి. మూడు వేర్వేరు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఫైనల్స్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ రికార్డ్ సాధించిన సంగతి తెలిసిందే.
సూర్య వైఫల్యంతో..
కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అయ్యర్ సత్తా చాటుతున్నాడు. అతని సారథ్యంలో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలి 6 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలోనే అయ్యర్‌కు టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గతేడాదిగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. దాంతో అయ్యర్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.

వచ్చే ఏడాది టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. వన్డే ప్రపంచకప్ 2027తో పాటు ఆసియా గేమ్స్, భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్‌లు ఏకకాలంలో జరగనున్నాయి. దాంతో రెండు వేర్వేరు టీ20 టీమ్స్‌ను సిద్దం చేయాలనే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ క్రమంలోనే చాలా మంది ఆటగాళ్లకు భారత జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించనుంది. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ వయస్సు పెరుగుతుండటంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం మరొక కెప్టెన్‌ను సిద్ధం చేసుకోవడానికి కూడా ఇదే మంచి అవకాశమని బీసీసీఐ భావిస్తోంది.
30-35 ఆటగాళ్లను సిద్దం చేస్తాం..
'ఆసియా గేమ్స్, భారత్ వర్సెస్ వెస్టిండీస్ టీ20 సిరీస్ ఒకే సమయంలో జరగనున్నాయి. అందుకే రెండు వేర్వేరు టీ20 జట్లు ఆడేలా మేం ప్రణాళికలు సిద్ధం చేయాలి. అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ఇప్పటి నుంచే 30-35 మంది క్రికెటర్ల బృందాన్ని అందుబాటులో ఉంచుకోవడం ముఖ్యం. అప్‌కమింగ్ ఐర్లాండ్ టూర్‌తో పాటు యూకే (UK) పర్యటనలకు సాధారణంగా వెళ్లే దానికంటే ఎక్కువ మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తాం. ఇదే విధానం ఆసియా క్రీడలకు కూడా కొనసాగుతుంది.'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.
బుడ్డోడిపైనే అందరి కళ్లు..
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీతో పాటు ప్రియాంశ్ ఆర్య, అనుకుల్ రాయ్, శశాంక్ సింగ్, అంగ్‌క్రిష్ రఘు వంశీలకు టీమిండియా తరఫున ఆడే అవకాశం దక్కనుంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఈ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీపై అందరి కళ్లు ఉన్నాయి. అతను భారత్ తరఫున అరంగేట్రం చేస్తే.. ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ సాధించనున్నాడు.
ఆయుష్ బదోనితో పాటు రజత్ పాటిదార్‌లకు టీమిండియా పిలుపు దక్కనుంది. బౌలింగ్‌లో రవిబిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, ప్రసిధ్ కృష్ణలు రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. కార్తీక్ త్యాగి పేరును కూడా సెలెక్టర్లు పరిశీలించనున్నారు. వికెట్ కీపర్-బ్యాటర్‌గా ధ్రువ్ జురెల్ రేసులో అందరికంటే ముందున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications