శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్!
ఆసియా కప్ 2025 జట్టులో చోటు దక్కించుకోని టీమిండియా వెటరన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక బాధ్యతలు అప్పగించింది. భారత్ ఏ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను సారథిగా ఎంపిక చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఐపీఎల్ 2024లో అసాధారణ ప్రదర్శన కనబర్చినా.. శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. శుభ్‌మన్ గిల్ కోసం అతన్ని భారత జట్టులోకి తీసుకోలేదు. దాంతో సెలెక్టర్లపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దాంతో తమ తప్పిదాన్ని సరిదిద్దుకునే క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌కు భారత్-ఏ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించారనే వాదన వినిపిస్తోంది.
అనధికారిక టెస్ట్‌లతో పాటు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత పర్యటనకు రానుంది. లక్నోలోని ఏక్‌నా స్టేడియంలో రెండు అనాధికార టెస్ట్‌లతో పాటు కాన్పూర్‌లో మూడు అనధికారిక వన్డేల్లో ఇరు జట్లూ తలపడతాయి. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్ట్‌లు ఆడే భారత్-ఏ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది.

ఈ జట్టు సారథ్య బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌కు అప్పగించింది. ధ్రువ్ జురెల్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు మహమ్మద్ సిరాజ్ రెండో అనధికారిక టెస్ట్ ఆడుతారని పేర్కొంది. లక్నో వేదికగా సెప్టెంబర్ 16 నుంచి ఈ అనధికారిక టెస్ట్‌లు ప్రారంభం కానున్నాయి. 16 నుంచి 19 మధ్య తొలి అనధికారిక టెస్ట్, సెప్టెంబర్ 23 నుంచి 26 మధ్య రెండో అనధికారిక టెస్ట్ జరగనుంది.
ఆసియాకప్ 2025 జట్టులో చోటు దక్కని శ్రేయస్ అయ్యర్.. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీలో 2025లో వెస్ట్ జోన్‌కు ఆడుతున్న అయ్యర్.. తొలి ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లో 25 పరుగులే చేసి వెనుదిరిగాడు. రుతురాజ్ గైక్వాడ్(184) భారీ శతకంతో రాణించగా.. యశస్వి జైస్వాల్(4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. వెస్ట్ జోన్‌కు సారథిగా వ్యవహరిస్తున్న శార్దూల్ ఠాకూర్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. జగదీశన్, రజత్ పటీదార్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications