ఆ ఇద్దరి వల్లే ఈ ఓటమి: శ్రేయస్ అయ్యర్

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ సూపర్ బ్యాటింగ్ కారణంగా తాము ఓటమిపాలయ్యామని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఈ ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో ఏం చేయాలో అర్థం కాలేదన్నాడు. ముఖ్యంగా పృథ్వీ షా తమ బౌలర్లపై విరుచుకుపడ్డాడని తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన కేకేఆర్ 44 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. బౌలింగ్‌లో ప్రత్యర్థి కట్టడి చేయలేకపోయామని అంగీకరించాడు. చేజింగ్‌లో సరైన అరంభం అందుకోలేదని, మిడిల్ ఓవర్లలో రాణించినా చివర్లో తడబడ్డామని చెప్పాడు.

పృథ్వీ షా విరుచుకుపడ్డాడు..
'ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పృథ్వీ షా మా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నిజాయితీగా చెప్పాలంటే అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో తమకు ఏం చేయాలో తోచలేదు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. దాంతో వారు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆ మూమెంటమ్‌ను చివరి వరకు కొనసాగించారు. ఇది పూర్తిగా బ్యాటింగ్ పిచ్. మేం మూడు మ్యాచ్‌లను చేజింగ్‌లోనే గెలుపొందాం. కానీ ఈ రోజు ఆ పని చేయలేకపోయాం.

మిడిల్ ఓవర్లలో రాణించినా..
ఈ రోజు ఆటలో మాకు ఏదైనా సానుకూలంశం ఉందా? అంటే అది మా పోరాట స్పూర్తే. సరైన ఆరంభం లభించలేకపోయినా.. మిడిల్ ఓవర్లలో అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాం. ముఖ్యంగా 7-15 ఓవర్ల మధ్య వేగంగా పరుగులు చేశాం. ఆ తర్వాత కూడా ఓవర్‌కు 12 పరుగుల చొప్పున చేయాలనుకున్నాం. ఇదేం పెద్ద కష్టమేం కాదు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు చేసిన తర్వాత చివర్లో చెలరేగడం సులువే. కానీ ఆ పని చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

వార్నర్, షా విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 61), పృథ్వీ షా(29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. రిషభ్ పంత్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), అక్షర్ పటేల్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్), శార్దూల్ ఠాకూర్(11 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో నరైన్ 2 వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, రస్సెల్, వరుణ్ తలో వికెట్ పడగొట్టారు.

కుప్పకూల్చిన కుల్దీప్..
అనంతరం కేకేఆర్ 19.4 ఓవర్లలో 171 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 54), నితీశ్ రాణా(20 బంతుల్లో 3 సిక్స్‌లతో 30) రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగగా..శార్దూల్ ఠాకూర్ రెండు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీశారు. లలిత్ యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications