Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs KKR: ఆ అత్యుత్సాహమే మా కొంపముంచింది: శ్రేయస్ అయ్యర్

పిచ్ కండిషన్స్‌ తగ్గట్లు ఆడకుండా బ్యాటింగ్‌లో అత్యుత్సాహం కనబర్చడమే తమ ఓటమిని శాసించిందని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన కేకేఆర్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. హ్యాట్రిక్ విజయాలతో ఈ సీజన్‌లో జోరు కనబర్చిన కేకేఆర్.. తొలి పరాజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. వెనువెంటనే వికెట్లు కోల్పోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. 'పిచ్‌ను అంచనా వేసే విషయంలో మేం తడబడ్డాం. పవర్ ప్లేలో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. కానీ మేం ఈ ఆరంభాన్ని అందిపుచ్చుకోలేకపోయాం.

Shreyas Iyer says

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయాం. పవర్ ప్లే తర్వాత పిచ్ పూర్తిగా మారిపోయింది. పరుగులు చేయడం చాలా కష్టమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. అందుకు తగ్గట్లుగా బౌలింగ్ చేసి మమ్మల్ని తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. ప్రతికూలంగా ఉన్న ఈ పిచ్‌పై కొత్త బ్యాటర్లకు వచ్చిరాగానే భారీ షాట్లు ఆడటం అంత సులువైన పనికాదు.

దాంతో మేం ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిర్మించాం. ఓ దశలో మేం సౌకర్యవంతంగా కనిపించాం. 160-170 పరుగులు చేసినా గెలవచ్చని భావించాం. కానీ వరుసగా వికెట్లు కోల్పోయి మూమెంటమ్ కోల్పోయాం. ఈ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తాం. తప్పిదాలను సవరించుకొని తదుపరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.

టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి ఓటమి ఎదురవ్వడం మా మంచికే. మా హోమ్ గ్రౌండ్ కండిషన్స్ మాకు బాగా తెలుసు. అందుకు తగ్గ ప్రణాళికలు రచించి పుంజుకుంటాం.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. శ్రేయస్ అయ్యర్(32 బంతుల్లో 3 ఫోర్లతో 34), సునీల్ నరైన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 27), అంగ్‌క్రిష్ రఘువంశీ( 18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 24) రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(3/18), తుషార్ దేశ్‌పాండే(3/33) మూడేసి వికెట్లతో కేకేఆర్ పతనాన్ని శాసించగా.. తీక్షణ ఓ వికెట్ తీసాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో9 ఫోర్లతో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. డారిల్ మిచెల్(25), శివమ్ దూబే(28) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా రెండు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Tuesday, April 9, 2024, 0:05 [IST]
Other articles published on Apr 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+