ఆ ఒక్క తప్పిదం మా ఓటమిని శాసించింది.. మా పోరాటం పట్ల గర్వంగా ఉంది: శ్రేయస్ అయ్యర్

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) లెగ్ స్పిన్నర్ వానిందు హసరంగా విషయంలో తాము చేసిన తప్పిదం ఓటమిని శాసించిందని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అయితే లోస్కోరింగ్ గేమ్‌లో తమ టీమ్ కనబర్చిన పోరాటం పట్ల గర్వంగా ఉందన్నాడు. ఆర్‌సీబీతో బుధవారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయం అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. తమ ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. బౌలర్లు అద్భుతంగా రాణించారని, కానీ బ్యాటింగ్ విభాగం విఫలమైందన్నాడు. హసరంగాను ఆఫ్ స్పిన్నర్‌లా ఆడుదామని అంతా నిర్ణయించుకున్నామని, కానీ ఆ ప్రణాళికను అమలు చేయలేక మూల్యం చెల్లించుకున్నామని చెప్పాడు.
హసరంగా బౌలింగ్‌ను...
'ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని ముందే ఊహించా. మా టీమ్ బౌలింగ్‌కు దిగే ముందే మా ఆటగాళ్లకు ఈ మ్యాచ్ మన అసలు సిసలు సత్తాకు పరీక్షగా నిలుస్తుందని చెప్పాను. మనం కనబర్చే పోరాటమే మానసిక స్థితిని తెలియజేస్తుందన్నా. ఈ మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లడం పట్ల గర్వపడుతున్నా. చివర్లో వెంకటేశ్ అయ్యర్‌కే బంతిని ఇవ్వాలనుకున్నా. ఎందుకంటే అతనికి అంతర్జాతీయ అనుభవం ఉంది. ఆరంభంలోనే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచడం చాలా ముఖ్యం. ఈ పిచ్‌పై విపరీతమైన పేస్, బౌన్స్ ఉంది. వానిందు హసరంగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతన్ని ఆఫ్ స్పిన్నర్‌గా ఆడాలని ముందు అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఆ ప్రణాళికలను అమలు పర్చలేకపోయాం'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
అదరగొట్టిన హసరంగా..
ఈ మ్యాచ్‌లో హసరంగా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తన తొలి ఓవర్‌లోనే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(13)ను ఔట్ చేసిన హసరంగా.. ఆ తర్వాత వరుస బంతుల్లో సునీల్ నరైన్(12), షెల్డన్ జాక్సన్(0)లను పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. చివరి ఓవర్‌లో టీమ్ సౌథీ(1) ఔట్ చేసి ఐపీఎల్‌లోనే 4/20 బెస్ట్ గణంకాలు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనతోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. అతనికి తోడు హర్షల్ పటేల్(2/11) కూడా రాణించడంతో కేకేఆర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
సిక్సర్‌తో గెలిపించిన కార్తీక్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రస్సెల్(25), ఉమేశ్ యాదవ్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. షెబాజ్ అహ్మద్(20 బంతుల్లో 3 సిక్స్‌లతో 27), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(40 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దినేశ్ కార్తీక్((7 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 14 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications