Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రింకూ సింగ్ హీరో అవుతాడనుకున్నా.. ఆ మార్పులే మా కొంపముంచాయి: శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer says Not Feeling Sad At All; That Was One Of The Best Games Of Cricket

ముంబై: ఉత్కంఠగా సాగిన తమ చివరి లీగ్‌లో ఓడినందుకు తనకేమి బాధలేదని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇప్పటి వరకు నేను ఆడిన క్రికెట్‌లో ఇది బెస్ట్ గేమ్ అని చెప్పాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫలితంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించి ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శ్రేయస్ అయ్యర్.. తమ జట్టు ఆటతీరు పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. పట్టువదలని తమ పోరాటతత్వం అద్భుతమని కొనియాడాడు. రింకూ సింగ్ ఈ రోజు హీరో అవుతాడని భావించానని, కానీ దురదృష్టవశాత్తు చిన్న తేడాతో మ్యాచ్‌ను కోల్పోయామని చెప్పాడు.

రింకూ ఇన్నింగ్స్ సూపర్...

రింకూ ఇన్నింగ్స్ సూపర్...

'ఈ ఓటమితో నేను నిరాశ చెందడం లేదు. ఇది నా క్రికెట్ కెరీర్‌లోనే ఒక బెస్ట్ గేమ్. మ్యాచ్ చివరి వరకు మేం చూపించిన పోరాటం అద్భుతం. రింకూ ఆడిన తీరును నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ దురదృష్టవశాత్తు అతను పూర్తి చేయలేకపోయాడు. అతను చాలా బాధపడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌ను రింకూ గెలిపిస్తాడని, హీరో అవుతాడని గట్టిగా నమ్మాను. కానీ అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఆట పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ఈ మ్యాచ్‌లో మేం ఇలా ఆడుతామని అస్సలు అనుకోలేదు. ఎందుకంటే పిచ్ చాలా పొడిగా ఉంది. గడ్డి కొంచెం కూడా లేదు. దాంతో స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించా.

గెలవాలనే కసితోనే..

గెలవాలనే కసితోనే..

లక్నో అద్భుతమైన ఆరంభాన్ని అందుకొని మా బౌలర్లపై విరుచుకుపడింది. మా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇది మాకు చావో రేవోలాంటి పరిస్థితి కావడంతో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా మా బ్యాటర్లు కడవరకు పోరాడాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనే కసితో ఆడారు. వీలైనంత మేరకు మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లి లక్నోను ఒత్తిడికి గురిచేయాలనే ప్రణాళికతోనే ఆడాం.ఈ సీజన్ మాకు ఏ మాత్రం ఊహించని రీతిలో సాగింది. మేం అద్భుతంగా ఆరంభించినా.. తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడటం మా ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.

మార్పులు చేయడం వల్లే..

మార్పులు చేయడం వల్లే..

అయితే జట్టులో మేం ఎక్కువ మార్పులు చేయడం వల్లనే ఇలా జరిగిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆటగాళ్ల గాయాలు, పేలవ ఫామ్ కారణంగానే మార్పులు చేయాల్సి వచ్చింది. అయితే రింకూ లాంటి సత్తా ఉన్న ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ సానుకూల దృక్పథమే ఉన్నది. ఎనాడు భయాందోళనకు గురైంది లేదు. మా కోచ్ మెక్‌కల్లమ్‌తో నాకు మంచి రిలేషన్ ఏర్పడింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అతనితో మాట్లడవచ్చు. మెక్‌కల్లమ్ ఆటగాళ్లను ఎప్పుడు జడ్జ్ చేయడు. అందర్ని సమానంగా చూస్తాడు.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

హై ఓల్టేజ్ మ్యాచ్..

హై ఓల్టేజ్ మ్యాచ్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. క్వింటన్ డికాక్(70 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 నాటౌట్) భారీ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. నితీశ్ రాణా(22 బంతుల్లో 9 ఫోర్లతో 42), సామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), రింకూ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 40) ధాటిగా ఆడారు. లక్నో బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్, మార్కస్ స్టోయినీస్ మూడేసి వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

Story first published: Thursday, May 19, 2022, 9:46 [IST]
Other articles published on May 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+