Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని వల్లే గెలిచాం.. ఆ అటిట్యూడ్ అద్భుతం: శ్రేయస్ అయ్యర్

నెహాల్ వధేరా అసాధారణ బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించి ఆడించగా.. బౌలర్లు నిప్పులు చెరిగారు. దాంతో పరుగులు రాబట్టడం ఇరు జట్ల బ్యాటర్లకు కష్టమైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 9 వికెట్లకు 95 పరుగులే చేయగా.. పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి సునాయస విజయాన్నందుకుంది. మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన అయ్యర్.. నెహాల్ వధేరాతో పాటు పంజాబ్ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.

Shreyas Iyer says Nehal Wadhera s attitude was top notch After PBKS beat RCB in IPL 2025
Photo Credit: screen grab for JioHotstar

'జీవితంలో విభిన్నమైన అనుభవాలతో పాటు అన్ని రకాల మ్యాచ్‌లు ఆడేందుకు మేం సిద్దంగా ఉన్నాం. ఇదో గొప్ప సవాల్. నిజం చెప్పాలంటే.. కెప్టెన్‌గా మైదానంలో నేను ఎక్కువగా ఆలోచించను. పరిస్థితులకు తగ్గట్లు ఎత్తుగడలు వేస్తూ ఉంటాను. కొత్త బ్యాటర్లు క్రీజులో సెట్ కాకూడదని భావించాను. మార్కో యాన్సెన్ ఎక్కువగా బౌన్స్ రాబట్టాడు. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వాస్తవానికి ఈ వికెట్‌ ఇలా ఉంటుందని మాకు అస్సలు తెలియదు. కానీ కండిషన్స్‌ను మా బౌలర్లు అద్భుతంగా అందిపుచ్చుకున్నారు.

నేను అర్ష్‌దీప్ సింగ్‌తో మాట్లాడినప్పుడు హార్డ్ లెంగ్త్ బాల్స్‌ను బ్యాటర్లు కొట్టలేరని చెప్పాడు. మధ్యలో మేం మాట్లాడుకున్నది ఇదే. ఈ ప్రణాళికను మా బౌలర్లు అద్భుతంగా అమలు చేశారు. నెహాల్ వధేరా అప్రోచ్ అసాధారణం. అతని అటిట్యూడ్ బాగుంది. అది ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నా. చాహల్‌తో నేను ప్రత్యేకంగా మాట్లాడాను. 'నువ్వో మ్యాచ్ విన్నర్. వీలైనంత వరకు వికెట్లు తీసే ప్రయత్నం చేయాలి. సేఫ్‌గా అస్సలు బౌలింగ్ చేయకు. వికెట్లు తీసేందుకే ప్రయత్నించు.'అని చెప్పాను. బౌన్స్ బ్యాక్ అయ్యే సామర్థ్యం చాహల్‌కు ఉంది. ఐపీఎల్‌లోనే అతను అత్యుత్తమ బౌలర్'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

పంజాబ్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ బ్యాటర్లు తేలిపోగా.. టీమ్ డేవిడ్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మిగతా బ్యాటర్లలో రజత్ పటీదార్(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. విరాట్ కోహ్లీ(1), ఫిల్ సాల్ట్(4), లివింగ్ స్టోన్(4), జితేశ్ శర్మ(2), కృనాల్ పాండ్యా(1) తీవ్రంగా నిరాశపరిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/23), మార్కో జాన్సెన్(2/10), యుజ్వేంద్ర చాహల్(2/11), హర్ప్రీత్ బ్రార్(2/25) రెండేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Saturday, April 19, 2025, 8:51 [IST]
Other articles published on Apr 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+