
సరైన ఆరంభమే..
'భారీ లక్ష్యచేధనలో మాకు సరైన ఆరంభమే లభించింది. రిక్వైర్డ్ రన్ రేట్ మెయింటేన్ చేస్తూనే బ్యాటింగ్ చేశాం. ఆరోన్ ఫించ్ అద్భుతంగా ఆడాడు. కానీ అతను ఔటైన వెంటనే మా పరుగుల వేగం కాస్త నెమ్మదించింది. దాంతో మేం కొంచెం వెనుకపడ్డాం. అయితే ఆటలో ఇవన్నీ సహజమే. దురదృష్టవశాత్తు ఈ రోజు మేం క్లిక్ అవ్వలేదు. ఇన్నింగ్స్ చివరి వరకు నేను బ్యాటింగ్ చేయాలనుకున్నా. అది సాధ్యం కాలేదు. రాజస్థాన్ బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్న తొలి బంతి నుంచే హిట్టింగ్ మొదలుపెట్టారు. రాణా సైతం చాహల్‌పై అలానే విరుచుకుపడ్డాడు.

బట్లర్‌ను ఔట్ చేసుంటే..?
కానీ దాన్ని కొనసాగించలేకపోయాడు. బట్లర్ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా ఆ తర్వాత చెలరేగాడు. అతను క్లాస్ బ్యాట్స్‌మన్. అతను ఆడిన తీరు అమోఘం. అతన్ని త్వరగా ఔట్ చేస్తే.. ఇంత భారీ స్కోర్ వచ్చేది కాదు. మంచు ప్రభావం చూపలేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. మాకు బ్రాబోర్న్ మైదానం కలిసి రావడం లేదు. తదుపరి మ్యాచ్‌లకైనా పకడ్బందీగా బరిలోకి దిగుతామని ఆశిస్తున్నా. చాలా ఒత్తిడి ఉంది. కానీ ఒత్తిడి అంటే చాలా ఇష్టం.
ప్రత్యర్థి ఎంత స్కోర్ చేసినా పెద్ద కథ కాదనే విషయం అందరికి చెప్పాలనుకున్నా. వాళ్లు అంత స్కోర్ చేసినప్పుడు మనం కూడా చేయగలుగుతామనేదే నా ఆలోచన విధానం'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

శతక్కొట్టిన బట్లర్
ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ టార్గెట్. జోస్ బట్లర్(61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 103) శతకానికి అండగా సంజూ శాంసన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) షిమ్రన్ హెట్‌మైర్(13 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్సర్లతో 26 నాటౌట్) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ 2 వికెట్లు తీయగా..శివం మావి, ప్యాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 210 పరుగులకు కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 85), ఆరోన్ ఫించ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్(5/40) హ్యాట్రిక్ వికెట్‌తో పాటు తొలిసారి ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. మెక్‌కాయ్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిధ్, అశ్విన్ తలో వికెట్ తీసారు.


Click it and Unblock the Notifications
