Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఫిట్‌గా ఉంటే నేను ఆడేవాడిని కాదు: శ్రేయస్ అయ్యర్

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉంటే తనకు తుది జట్టులో చోటు దక్కేది కాదని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. కోహ్లీ స్థానంలో ఆడే అవకాశాలు ఉన్నాయని కెప్టెన్ రోహిత్ శర్మ లేట్ నైట్‌ చెప్పాడని, దాంతో అప్పటి వరకు సినిమా చూస్తున్న తాను వెంటనే పడుకున్నానని తెలిపాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో గురువారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు. స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో డేంజరస్ ఫిల్ సాల్ట్‌ను రనౌట్ చేసిన అయ్యర్.. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును దూకుడైన బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించాడు.

Shreyas Iyer says he wasn t in the original playing XI

ఈ మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 'అదో ఫన్నీ స్టోరీ. గత రాత్రి నేను ఓ సినిమా చూశాను. ఆ మూవీ కోసం ఆలస్యంగా నిద్రపోవాలనుకున్నా. కానీ నాకు కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. 'నువ్వు రేపు ఆడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ మోకాలికి వాపు వచ్చింది. రెడీ ఉండు'అని చెప్పాడు. వెంటనే నేను సినిమా ఆపేసి పడుకున్నాను.'అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

దేశవాళీ క్రికెట్‌తో తన ఫిట్‌నెస్, బ్యాటింగ్ మెరుగైందని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.'ఇంగ్లండ్ బౌలర్లు నాకు ఎక్కువగా షార్ట్ పిచ్ డెలివరీలు వేసారు. నేను వారి పేస్‌ను ఉపయోగించి షాట్స్ ఆడాలనుకున్నాను. వీలైనంత వరకు బంతిని గాల్లోకి పంచించాలనుకున్నాను. ఎందుకంటే పవర్ ప్లేలో ఫీల్డ్ మొత్తం సర్కిల్ లోపలే ఉంది. దాంతోనే దూకుడుగా ఆడాను. దేశవాళీ క్రికెట్ ఆడటం నాకు కలిసొచ్చింది.

నా ఇన్నింగ్స్ అప్రోచ్ ఎలా ఉండాలనే విషయంపై ఓ అవగాహన వచ్చింది. నా ఆలోచన విధానం మెరుగైంది. నైపుణ్యాలు కూడా మెరుగయ్యాయి. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్ గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. దేశవాళీ క్రికెట్ ఆడటం వల్ల నా ఆట తీరు‌తో పాటు ఫిట్‌నెస్ కూడా ఎంతో మెరుగైంది.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. శుభ్‌మన్ గిల్(96 బంతుల్లో 14 ఫోర్లతో 87 ), అక్షర్ పటేల్(47 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 52 ) శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Story first published: Friday, February 7, 2025, 6:25 [IST]
Other articles published on Feb 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+