For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ విరామమే నాకు కలిసొచ్చింది.. డ్రెస్సింగ్ రూమ్‌ మొత్తం జోష్‌లో ఉంది: శ్రేయస్ అయ్యర్

భారత జట్టుకు దూరంగా ఉండటమే తనకు కలిసొచ్చిందని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు మధ్యలో దొరికిన విరామంలో తన టెక్నిక్‌పై ఫోకస్ పెట్టానని, ముఖ్యంగా డ్రాప్-ఇన్ షాట్స్‌తో సింగిల్స్ తీయడం నేర్చుకున్నానని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ మోకాలికి వాపు రావడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్‌తో నెంబర్ 4 స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

దుమ్మురేపిన అయ్యర్..
తొలి వన్డేలో 59 పరుగులు చేసిన అయ్యర్.. రెండో వన్డేలో 44 పరుగులు.. మూడో వన్డేలో 78 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం తన బ్యాటింగ్‌పై మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. దేశవాళీ క్రికెట్ సందర్భంగా ప్రతీ బంతి కట్, ఫుల్ షాట్స్ ఆడకుండా.. స్ట్రైక్ రొటేట్ చేయడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నానని చెప్పాడు. ముఖ్యంగా శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను సింగిల్స్‌గా మల్చడం సంతృప్తినిచ్చిందని చెప్పాడు.

Shreyas Iyer says Everyone is in great form for Champions Trophy After India Clean Sweep Over England

'తొలి వన్డేలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత ధాటిగా ఆడి మూమెంటమ్ తీసుకురావాలనుకున్నాను. బంతిని క్లీన్‌గా హిట్ చేసే ప్రయత్నం చేశాను. నా బలాలను నమ్ముకొని పరుగులు రాబట్టే ప్రయత్నం చేశాను. రెండో వన్డేలో మ్యాచ్‌ను ముగించాలనే ఆలోచనతో బ్యాటింగ్ చేశాను. చివరి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుతమైన ప్లాట్‌ఫామ్ సెట్ చేశారు. అది నాకు ఉపయోగపడింది. అయితే ఈ మ్యాచ్‌లో నేను సెంచరీ చేస్తే బాగుండేది.

నా టెక్నిక్‌ను మెరుగైంది..
దేశవాళీ క్రికెట్ ఆడే సమయంలో దొరికిన విరామాన్ని నా టెక్నిక్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకున్నాను. ముఖ్యంగా డ్రాప్-ఇన్ షాట్స్‌తో సింగిల్స్ తీయడం నేర్చుకున్నాను. ఎప్పుడూ కట్స్, పుల్ షాట్స్ ఆడటం కాకుండా సింగిల్స్ తీయడం కూడా ముఖ్యమనే విషయాన్ని తెలుసుకున్నాను. శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను సింగిల్స్‌గా మలుస్తుండటం నాకు సంతృప్తినిస్తోంది.

డ్రెస్సింగ్ రూమ్ అంతా మంచి జోష్‌లో ఉంది. జట్టులో ప్రతీ ఆటగాడు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ సిరీస్‌ను గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ‌కి ఈ ఉత్సాహాన్ని తీసుకెళ్లడం గొప్ప విషయం. ఈ మూడు వన్డేల్లో ప్రతీ ఆటగాడు ఎలా బాధ్యత తీసుకున్నారో చూడవచ్చు. కీలకమైన పరుగులు చేయడం.. వికెట్లు తీయడం చాలా ముఖ్యం. ఈ సిరీస్‌లో జట్టుగా మేం రాణించాం. టీమ్‌గా మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తాం. సిరీస్‌లో ఉత్తమ ఫీల్డర్‌గా అవార్డును నేను పొందుతానని ఆశిస్తున్నాను. ఈ సిరీస్‌‌లో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ నాకే దక్కుతుందనే ఆశిస్తున్నాను.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 13, 2025, 9:05 [IST]
Other articles published on Feb 13, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+