
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన అయ్యర్.. సరైన టీమ్ కాంబినేషన్ కోసమే వెంకటేశ్ అయ్యర్‌ను పక్కనపెట్టామని స్పష్టం చేశాడు.
'సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉంటుందనే ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాను. అంతేకాకుండా తరుచుగా ఉపయోగించిన వికెట్ ఇది. చాలా వరకు గెలవాల్సిన మ్యాచ్‌ల్లోనే ఓడిపోయాం. పాజిటీవ్ క్రికెట్ గురించే మేం చర్చించాం. మేం నిర్భయంగా ఆడాల్సిన అవసరం ఉంది. జట్టులో రెండు మార్పులు చేశాం. వెంకటేశ్ అయ్యర్ స్థానంలో అనుకుల్ రాయ్ బరిలోకి దిగాడు. హర్షిత్ రాణా స్థానంలో మావి వచ్చాడు. సరైన కాంబినేషన్‌తో బరిలోకి దిగడం చాలా ముఖ్యం. దాంతోనే వీలైనన్ని అవకాశాలు ఆటగాళ్లకు ఇవ్వాలనుకుంటున్నాం'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిచినా గెలవకున్నా తమకు కలిగే నష్టం ఏం లేదని సంజూ శాంసన్ తెలిపాడు. టీ20 ఫార్మాట్‌లో చిన్న తప్పిదం కూడా నష్టం చేస్తోందన్నాడు. మేం ఇప్పటికే లీగ్‌లో హై స్టాండర్డ్ సెట్ చేశామని, అది అలానే కొనసాగిస్తే సరిపోతుందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేశామని, డారిల్ మిచెల్ స్థానంలో కరుణ్ నాయర్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు. పరిస్థితులకు తగ్గట్లే జట్టులో మార్పులు చేస్తున్నామని, ఈ రోజు కరుణ్ నాయర్ సరైనవాడని అతని తీసుకున్నామని తెలిపాడు.
తొలి దశలో (ఏప్రిల్ 18) జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో కేకేఆర్‌పై రాజస్థాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు రాజస్థాన్ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్ 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలతో ఆఖరి నుంచి మూడో స్థానంలో నిలిచింది.
తుది జట్లు (అంచనా):
కేకేఆర్: ఆరోన్ ఫించ్, సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, బాబా ఇంద్రజిత్, అనుకుల్ రాయ్, రింకూ సింగ్, ఆండ్రీ రసెల్, ఉమేశ్ యాదవ్, టిమ్ సౌథీ, శివం మావి
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్, కరుణ్ నాయర్, షిమ్రాన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, అశ్విన్, బౌల్ట్, ప్రసిద్ద్, చహల్, కుల్దీప్ సేన్