న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో బరిలోకి దిగే భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గాయాలతో జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మల స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, రవిబిష్ణోయ్‌లకు అవకాశం దక్కింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది.
టెస్టిక్యులర్ టోర్షన్ సర్జరీతో తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20లకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌ల్లో అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు భారత సెలెక్టర్లు అవకాశం కల్పించారు. టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అవకాశం దక్కుతుందని అంతా భావించగా.. సెలెక్టర్లు మాత్రం అయ్యర్ వైపు మొగ్గు చూపారు.

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో సైడ్ స్ట్రెయిన్ గాయంతో ఇబ్బంది పడిన వాషింగ్టన్ సుందర్ వన్డే సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లతో పాటు ఐదు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో రవి బిష్ణోయ్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు జరిగిన ఈ మార్పులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. దాంతోనే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి బీసీసీఐ ఒకే జట్టును ఎంపిక చేసింది. కానీ గాయాలతో చివరి నిమిషంలో తిలక్ వర్మ, సుందర్ దూరమయ్యారు.
తొలి మూడు టీ20ల్లో అయ్యర్ అద్భుతంగా రాణిస్తే ప్రపంచకప్ 2026 జట్టులో తిలక్ వర్మ చోటు గల్లంతయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అయ్యర్‌తో తిలక్ వర్మకు చెక్ పెట్టారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. తిలక్ వర్మ వేగంగా కోలుకొని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించి చివరి రెండు టీ20ల్లో రాణిస్తేనే ప్రపంచకప్ జట్టులో ప్లేస్ ఉంటుందనే చర్చ జరుగుతుంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (మొదటి మూడు టీ20లకు), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.