హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదినా జట్టులో చోటు ఖాయమని చెప్పలేం: శ్రేయస్ అయ్యర్

న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత జట్టులో తీవ్ర పోటీ నెలకొందని, హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు బాదినా జట్టులో చోటు ఖాయమని చెప్పలేమని స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. జట్టులో చోటు గురించి ఆలోచించకుండా తన ఆటను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ దూరమవడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్.. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్.. మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు (57, 74, 73) నమోదు చేసి జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించాడు. ఈ సిరీస్‌లో మొత్తం 174 స్ట్రైక్ రేటుతో 204 పరుగులు చేసిన శ్రేయస్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు' గెలుచుకున్నాడు.
మూడో టీ20 విజయానంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ దిగడం చాలా కంఫర్ట్‌గా ఉందన్నాడు. టీ20 ఫార్మాట్‌లో తొలి మూడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగే ఆటగాళ్లే మ్యాచ్ జయాపజయాలను నిర్ణయిస్తారని, లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి దిగితే క్రీజులో కుదురుకుని ఆడేంత సమయం ఉండదని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

జట్టులో తీవ్ర పోటీ..
'ప్రస్తుతం జట్టులో పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఆటగాళ్లంతా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని సత్తా చాటుతున్నారు. వ్యక్తిగతంగా నేను కూడా ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాను. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉండటం చాలా గొప్పగా అనిపిస్తోంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్ దిగడం చాలా కంఫర్ట్‌గా ఉంది. పొట్టి ఫార్మాట్లో తొలి మూడు స్థానాల్లో బ్యాటింగ్‌కి దిగే ఆటగాళ్లే మ్యాచ్ జయాపజయాలను నిర్ణయిస్తారు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి దిగితే క్రీజులో కుదురుకుని ఆడేంత సమయం ఉండదు.

టీ20 ప్రపంచకప్ జట్టులో..
ఈ సిరీస్‌లో గొప్పగా రాణించాను. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత విజయాన్ని ఆస్వాదిస్తున్నాను. కాస్త విరామం తీసుకుని.. మళ్లీ ఆడటం మొదలు పెడుతాను. జట్టులో నా స్థానం గురించి ఆలోచించడం లేదు. ప్రస్తుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం పదిలమైనట్లేనని భావించడం కూడా సరికాదు. ప్రస్తుతం జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో.. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు క్లిష్ట పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చినా సత్తా చాటేందుకు సిద్దంగా ఉండాలి' అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

బలాలను మరిచిపోతాం..
ప్రతీ ఆటగాడిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. మనలోని బలహీనతలపై ఎక్కువగా దృష్టి పెడితే.. బలాలను మర్చిపోతామని చెప్పాడు.'షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. వేరే వాళ్లు నాలో ఆ బలహీనత ఉందని భావించినా ఫర్వాలేదు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనేందుకు నేనేం ప్రత్యేకంగా సాధన చేయలేదు. మన ఆలోచన తీరు సరిగా ఉంటే ఎలాంటి బంతినైనా సమర్థంగా ఎదుర్కోవచ్చు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కుంటూనే ఈ స్థాయికి రాగలిగాను.

బలహీనతలపై..
ప్రతి ఆటగాడిలోనూ బలాలు, బలహీనతలు ఉంటాయి. బలహీనతలను అధిగమించడంపై ఎక్కువగా దృష్టి పెట్టి.. మన బలాలను మర్చిపోకూడదు. నేను ఎలా ఆడుతున్నానో నాకు తెలుసు. వాటి ఫలితాలను మీరందరూ చూస్తున్నారు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచులో.. నేను ఎదుర్కొన్న తొలి 12 బంతులకు 12 పరుగులే చేశాను. ఆ తర్వాత పుంజుకుని ధాటిగా ఆడాను. చివరి రెండు మ్యాచుల్లో మొదటి నుంచే వేగంగా ఆడటం మొదలెట్టాను' అని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications