Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు బ్యాడ్‌న్యూస్‌.. చివరి రెండు వన్డేలకు శ్రేయస్‌ అయ్యర్‌ దూరం! ఐపీఎల్ 2021 కూడా!

Shreyas Iyer out of England ODI Series with shoulder injury, And to miss first half of IPL 2021 also

పూణే: టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ భుజ గాయం కారణంగా మూడు వన్డే సిరీస్‌లోని మిగతా రెండు మ్యాచులకు దూరమయ్యాడు. అయ్యర్‌ దూరమవడంతో.. వన్డే అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయినట్టే. అయ్యర్ స్థానంలో సూర్య రెండో వన్డేలో ఆడనున్నాడు. ఇక వన్డే సిరీస్ మాత్రమే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కు కూడా అయ్యర్‌ దాదాపు దూరం కానున్నాడు. ఇది ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.

 ఫీల్డింగ్‌ చేస్తూ:

ఫీల్డింగ్‌ చేస్తూ:

తొలి వన్డేలో శ్రేయస్‌ అయ్యర్ ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఏనిమిదో ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో కొట్టిన షాట్‌ను అడ్డుకునే క్రమంలో డైవ్ చేసిన అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే టీమ్ ఫీజియోలు వచ్చి భుజ గాయాన్ని పరీక్షించగా.. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి సూచనల మేరకు మైదానం వీడాడు. ఆ సమయంలో అతడు నొప్పితో విలవిల్లాడాడు. దీంతో అయ్యర్‌ను వైద్య పరీక్షల కోసం వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 సర్జరీ చేయాల్సి వస్తే:

సర్జరీ చేయాల్సి వస్తే:

గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయిన శ్రేయస్‌ అయ్యర్.. ఐపీఎల్‌ 2021 మొదటి సగం మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు. ఒకవేళ తన ఎడమ భుజానికి సర్జరీ చేయాల్సి వస్తే.. ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొత్తానికి అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. మరిన్ని వైద్య పరీక్షలు, డాక్టర్ల సూచలను పరిగణనలోకి తీసుకొని శస్త్రచికిత్సపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు అయ్యర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

రోహిత్‌ గాయం పెద్దది కాకపోవడంతో:

రోహిత్‌ గాయం పెద్దది కాకపోవడంతో:

మొదటి వన్డే‌లోనే టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా అతని మోచేతికి బంతి బలంగా తాకింది. వుడ్‌ వేసిన బంతి రోహిత్‌ కుడి మోచేతికి బలంగా తాకింది. నొప్పికి రెండుసార్లు మైదానంలోనే చికిత్స చేయించుకొని ఆట కొనసాగించాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో రోహిత్ ఫీల్డింగ్‌కు దూరంగా ఉన్నాడు. అయితే రోహిత్‌ గాయం పెద్దది కాకపోవడంతో అతను రెండో వన్డే ఆడే అవకాశాలు ఉన్నాయి.

 మోర్గాన్‌ డౌటే:

మోర్గాన్‌ డౌటే:

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సామ్‌ బిల్లింగ్స్‌ కూడా రెండో వన్డేలో బరిలోకి దిగేది అనుమానంగా మారింది. ఫీల్డింగ్‌ చేస్తుండగా ఇద్దరు గాయపడ్డారు. మోర్గాన్‌కు తన కుడి బొటనవేలు, చూపుడు వేలు మధ్య గాయం కావడంతో నాలుగు కుట్లు కూడా వేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. బౌండరీ లైన్‌ వద్ద బంతిని ఆపే క్రమంలో బిల్లింగ్స్‌ డైవ్‌ చేయగా ప్రమాదకరంగా తన భుజం గ్రౌండ్‌కు తాకడంతో కాలర్‌బోన్‌కు గాయమైంది.

'ధావన్ విజయవంతం కావడం సంతోషం.. అతడి వయసుపై వచ్చిన విమర్శలన్నీ కొట్టుకుపోయాయి'

Story first published: Wednesday, March 24, 2021, 18:16 [IST]
Other articles published on Mar 24, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+