Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

BCCI: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, వైభవ్‌కు చోటు!

అందరూ ఊహించినట్లుగానే టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్‌‌కు అప్పగించారు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో పాటు ఆసియా గేమ్స్ ఆడే భారత టీ20 జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం ప్రకటించింది. ముంబైలోని బీసీసీఐ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన సెలెక్షన్ కమిటీ అనంతరం 16 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది.

టీమిండియా టీ20 కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్‌కు జట్టులో కూడా చోటు దక్కలేదు. శ్రేయస్ అయ్యర్‌ను నూతన సారథిగా ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ.. అతనికి డిప్యూటిగా తెలుగు తేజం తిలక్ వర్మను నియమించింది. ఐపీఎల్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీకి ఈ జట్టులో చోటు దక్కింది. లక్నోసూపర్ జెయింట్స్ పేసర్ ప్రిన్స్ యాదవ్ కూడా తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు.

రజత్ పాటిదార్‌కు నోఛాన్స్..

మరోవైపు ఆర్‌సీబీని విజేతగా నిలబెట్టిన రజత్ పాటిదార్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డితో పాటు సంజూ శాంసన్, ఇషన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

Shreyas Iyer Named T20I Captain Vaibhav Sooryavanshi Earns Maiden Call-Up for UK tour and Asian Games

ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల నుంచి జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి కల్పించారు. ఆసియా గేమ్స్‌ కోసం ఎంపిక చేశారు. బుమ్రాతో పాటు హర్షిత్ రాణా కూడా ఆసియా గేమ్స్‌కు ఎంపికవ్వగా సిరాజ్, ప్రిన్స్ యాదవ్‌లను పక్కనపెట్టారు.

జూన్ చివర్లో ఇంగ్లండ్ పర్యటన..

అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌ల అనంతరం టీమిండియా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్‌తో జూన్ 26న, జూన్ 28న రెండు టీ20లు జరగనుండగా.. ఇంగ్లండ్‌తో జులై 1న, జులై 4న, జులై 7న, జులై 9న, జులై 11న ఐదు టీ20లు జరగనున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఆసియా గేమ్స్ జరగనున్నాయి.


ఇంగ్లండ్, ఐర్లాండ్‌తో సిరీస్‌లకు జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.

ఆసియా గేమ్స్‌కు భారత జట్టు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తీ, వైభవ్ సూర్యవంశీ, జస్‌ప్రీత్ బుమ్రా.

Story first published: Saturday, June 6, 2026, 14:15 [IST]
Other articles published on Jun 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+