ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్‌లో వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ వైదొలగడంతో జట్టు యాజమాన్యం శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీకి అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
అయితే, తాను కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన చేశాడు. 40 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా వ్యహరించిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన నాలుగో క్రికెటర్‌గా అయ్యర్ అరుధైన ఘనత సాధించాడు.

నాలుగో ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్
గతంలో 2008లో గిల్ క్రిస్ట్(డెక్కన్ చార్జర్స్), 2013లో అరోన్ ఫించ్(పుణె వారియర్స్), 2016లో మురళీ విజయ్(కింగ్స్ పంజాబ్)లు కెప్టెన్లుగా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీలు సాధించిన క్రికెటర్లుగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఐపీఎల్‌లో తాను కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని అయ్యర్ నమోదు చేశాడు.

అరుదైన సందర్భం
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఇంకొక అరుదైన సందర్భం చోటు చేసుకుంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా బౌలింగ్‌లో ఎంతో నియంత్రణను ప‍్రదర్శించింది. 14 ఓవర్ల పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు కనీసం ఒక్క ఎక్స్‌ట్రా కూడా లేకుండా బౌలింగ్ వేసింది. కోల్‌కతా బౌలర్లు మిచెల్ జాన్సన్, ఆండ్రీ రస్సెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, శివం మావి, సునీల్ నరైన్‌లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

15 ఓవర్ తొలి బంతికి నైట్‌రైడర్స్ వైడ్‌తో ఎక్స్‌ట్రా
అయితే, చివరకు 15 ఓవర్ తొలి బంతికి నైట్‌రైడర్స్ వైడ్‌తో ఎక్స్‌ట్రాకు స్వాగతం పలికింది. కోల్‌కతా బౌలర్ ఆండ్రీ రస్సెల్ ఇన్నింగ్స్ తొలి వైడ్‌ను వేశాడు. దాంతో 14 ఓవర్లపాటు అదనపు పరుగు లేకుండా బౌలింగ్ చేసి అరుదైన ఘనతను కోల్‌కతా నైట్‌రైడర్స్ దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ సమిష్టిగా రాణించడంతో కోల్‌కతా ఓటమి పాలైంది.

55 పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమి
కోట్లా వేదికగా శుక్రవారం రాత్రి కోల్ కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీ ఆరంభం నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

కోల్‌కతాకి వరుసగా ఇది రెండో ఓటమి
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్(44)కు తోడు శుభ్‌మాన్ గిల్(37), నరైన్(26)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా వారంతా స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది. టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత మళ్లీ ఢిల్లీ గెలుపొందగా.. కోల్‌కతాకి వరుసగా ఇది రెండో ఓటమి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications