నా కెప్టెన్సీ నాదే.. ఎవరి మాట వినను: శ్రేయస్ అయ్యర్ (వీడియో)
భారత టీ20 క్రికెట్‌లో కొత్త అధ్యాయం మొదలైంది. ఐపీఎల్‌లో సారథిగా సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ కీలక బాధ్యతలు అప్పగించింది. టీమిండియా టీ20 సారథిగా నియమించింది. అప్‌కమింగ్ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌లో భారత టీ20 జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించనున్నాడు. మరోవైపు పేలవ ఫామ్‌తో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోయాడు.
నిలకడగా రాణించినా సూర్యకుమార్ యాదవ్ కారణంగానే శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను చివరి సారిగా 2023లో టీమిండియా తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జరిగిన రెండు టీ20 ప్రపంచకప్ 2024, 2026 టోర్నీలతో పాటు ఆసియా కప్‌కు శ్రేయస్ అయ్యర్ దూరంగా ఉన్నాడు.
సూర్య వైఫల్యంతో..
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత టీ20 జట్టు విజేతగా నిలిచింది. భారత్ గెలిచినా.. సూర్య దారుణంగా విఫలమయ్యాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌తో తన సారథ్య ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడమే కాకుండా ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు.

తాజా సీజన్‌లోనూ జట్టును మెరుగ్గా నడిపించాడు. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. దాంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శ్రేయస్ వైపు మొగ్గు చూపింది. శ్రేయస్ రాకతో సూర్య కెప్టెన్సీతో పాటు జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది.
ఎవరి నీడలో ఉండను..
టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శ్రేయస్ అయ్యర్ ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. కెప్టెన్సీ కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోనని తెలిపాడు. గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉంటానని, ఎవరి నీడలోనూ ఉండాలనుకోవడం లేదని స్పష్టం చేశాడు. గంభీర్ మాట అసలే విననని పరోక్షంగా వెల్లడించాడు.
'కెప్టెన్‌గా నాకు లభించిన ఈ బాధ్యత అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నది. కెప్టెన్సీ కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను గతంలో ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలాగే ఉంటాను. మరొకరిలా మారడానికి ఏ మాత్రం ప్రయత్నించను. ఎవరి నీడలోనూ ఉండాలనుకోవడం లేదు.' అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాడు.
గంభీర్‌కు వార్నింగ్..?
కెప్టెన్సీ సవాలును స్వీకరిస్తూనే, తన సహజ శైలిలోనే జట్టును ముందుకు నడిపిస్తానని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు. అతని మాటలు నాయకుడిగా తనపై తనకు ఉన్న స్పష్టతను తెలియజేస్తున్నాయి. మరోవైపు గౌతమ్ గంభీర్‌కు కూడా అయ్యర్ గట్టి సందేశాన్ని ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు గంభీరే అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. తుది జట్టు ఎంపిక నుంచి ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పుల వరకు అన్ని గంభీర్ డైరెక్షన్‌లోనే నడిచాయి. వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా గంభీర్ సూచనలే పాటిస్తున్నాడు. అయ్యర్ మాత్రం తాను అలా ఉండబోనని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

