పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహనం కోల్పోయాడు. సహచర ఆటగాళ్లపై కన్నెర్ర చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కెప్టెన్ అయిన తనను సంప్రదించకుండా డీఆర్‌ఎస్ తీసుకోవడంతో అయ్యర్ ఆగ్రహానికి గురయ్యాడు. తనను అడిగి రివ్యూ తీసుకోవాలని వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో పాటు మ్యాక్స్‌వెల్‌ను మందలించాడు.
సన్‌రైజరస్ హైదరాబాద్ బ్యాటింగ్ సందర్భంగా మ్యాక్స్‌వెల్ వేసిన 4వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని డౌన్ ద లెగ్ సైడ్ వేయగా.. అంపైర్ వైడ్ ఇచ్చాడు. అయితే ఈ నిర్ణయాన్ని మ్యాక్స్‌వెల్‌తో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సవాల్ చేశారు. కెప్టెన్ అయ్యర్‌ను సంప్రదించకుండానే రివ్యూ కోరారు. దాంతో ఆగ్రహానికి గురైన అయ్యర్..వారిని మందలించి రివ్యూ తీసుకున్నాడు. అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను యుజ్వేంద్ర చాహల్ పట్టే ప్రయత్నం చేయలేదు. దాంతో శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. క్యాప్ తీసి నేలకు కొట్టబోయి తనను తాను నియంత్రించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు.