న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పుగా అర్థం చేసుకున్నారు.. అందుకే మా సీఈవో పేరు ప్రస్తావించా: శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Issues Clarification On His CEO Is Also Involved In Team Selection Comment

పుణె: కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు విషయంలో తమ టీమ్ సీఈవో పాత్ర కూడా ఉందని ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గతవారం సంచలన వ్యాఖ్యలు చేసాడు. దాంతో కేకేఆర్ జట్టులో కెప్టెన్‌గా అయ్యర్‌కు స్చేచ్చలేదని, టీమ్‌మేనేజ్‌మెంట్ జోక్యం ఎక్కువైందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఈ సీజన్‌లో కేకేఆర్ వైఫల్యానికి టీమ్ మేనేజ్‌మెంట్ జోక్యమే కారణమనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.

 యువ ఆటగాళ్లతో మాట్లాడుతున్నాడనే..

యువ ఆటగాళ్లతో మాట్లాడుతున్నాడనే..

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో విజయానంతరం మాట్లాడిన అయ్యర్.. తన వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చాడు. తాను ఎందుకు కోల్‌కతా సీఈవో పేరు తెచ్చానో వివరించాడు. 'నేనిక్కడ ఒక విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. గతమ్యాచ్‌లో నేను సీఈవో పేరు ప్రస్తావించాను. నా ఉద్దేశం ఏమిటంటే.. ఆయన తుది జట్టులో అవకాశాలు రాని ఆటగాళ్లతో కలిసి మాట్లాడి పరిస్థితులను వివరించే పనిలో ఉన్నారు. కొన్నిసార్లు మేం తుది జట్టును ఎంపిక చేయడం కూడా కష్టంగా ఉంటుంది. ఆ విషయమే చెప్పాను. కానీ అందరూ మరోలా అర్థం చేసుకున్నారు'అని అయ్యర్ స్పష్టం చేశాడు.

గెలవాలనే బరిలోకి దిగాం..

గెలవాలనే బరిలోకి దిగాం..

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సాధించిన విజయంపై స్పందిస్తూ.. 'ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో వచ్చాం. అంత దృఢంగా మానసిక నిర్ణయం తీసుకున్నాం. మా ఆటగాళ్లు భయం లేకుండా అద్భుతంగా ఆడారు. ఇక టాస్‌ గెలవడం కూడా ఇక్కడ ముఖ్యమైనదే. పుణెలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లే ఎక్కువగా గెలిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాం. దీంతో ప్రణాళికా బద్దంగా ఆడాం. మా బ్యాటింగ్‌లో వీలైనంత ఎక్కువగా రస్సెల్‌కు ఆడే అవకాశం కల్పించాం. సామ్‌ కూడా బాగా ఆడాడు. ఇక చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడతామని ఆశిస్తున్నా. ఈ స్లో వికెట్‌పై సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి గొప్పగా బౌలింగ్‌ చేసి కీలక వికెట్లు తీశారు. దీంతో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ను పూర్తిగా కట్టడి చేశాం' అని వివరించాడు.

రస్సెల్ ఆల్‌రౌండ్ షో..

రస్సెల్ ఆల్‌రౌండ్ షో..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్), సామ్ బిల్లింగ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించగా... అజింక్యా రహానే(24 బంతుల్లో 3 సిక్స్‌లతో 28),నితీశ్ రాణా(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) ధాటిగా ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో చెలరేగగా.. భువీ, జాన్సెన్, నట్టూ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో 43), ఎయిడెన్ మార్క్‌రమ్(25 బంతుల్లో 3 సిక్స్‌లతో 32) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ మూడు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 15, 2022, 12:19 [IST]
Other articles published on May 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X