'కెప్టెన్సీని విజయంతో ప్రారంభించడం గొప్పగా అనిపిస్తోంది'

హైదరాబాద్: ఐపీఎల్‌లో తన కెప్టెన్సీని విజయంతో ప్రారంభించడం చాలా గొప్పగా అనిపిస్తోందని 23 ఏళ్ల శ్రేయాస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు సారథ్యం వహించడంతో పాటు అద్భుతమైన బ్యాటింగ్‌తో ఢిల్లీకి అతి పెద్ద విజయాన్ని కట్టబెట్టారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రేయస్ అయ్యర్ 40 బంతుల్లో 93 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో కోల్ కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టోర్నీ ఆరంభం నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ జట్టు ఏడో స్థానానికి ఎగబాకింది.

20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లలో ఆండ్రీ రస్సెల్(44)కు తోడు శుభ్‌మాన్ గిల్(37), నరైన్(26)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా వారంతా స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు చేరడంతో కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి ఓటమి పాలైంది.

ఇది గొప్పగా అనిపిస్తోంది
టోర్నీలో వరుసగా మూడు పరాజయాల తర్వాత మళ్లీ ఢిల్లీ గెలుపొందగా.. కోల్‌కతాకి వరుసగా ఇది రెండో ఓటమి. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ 'ఇది గొప్పగా అనిపిస్తోంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. టాస్ గెలిస్తే.. మొదట బౌలింగ్ తీసుకుందామని అనుకున్నాం. కానీ, టాస్ ఓడటం కూడా మంచిదే అయింది' అని అయ్యర్ అన్నాడు.

పృథ్వీ షా-కొలిన్ మన్రోల జోడీ చక్కటి శుభారంభం
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి.. తొలుత బ్యాటింగ్ తీసుకున్నప్పటికీ ఢిల్లీకి ఆ జట్టు ఓపెనర్లు పృథ్వీ షా-కొలిన్ మన్రోల జోడీ చక్కటి శుభారంభాన్నిచ్చింది. ముఖ్యంగా 44 బంతుల్లో 62 పరుగులు చేసిన యువ క్రికెటర్ పృథ్వీషాపై శ్రేయస్ అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'పృథ్వీ షా ఢిల్లీకి మంచి ఆరంభాన్ని ఇచ్చాడని, ఈ సీజన్ ప్రారంభమైన నాటినుంచి అతను బాగా ఆడుతూ.. జట్టుకు అవసరమైన శుభారంభాలను ఇస్తున్నాడు.

కొలిన్ మున్రో, ప్లంకెట్‌పై అయ్యర్ ప్రశంసలు
ఐపీఎల్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో కూడా చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్‌లో ఎలా స్టార్ట్ చేశాం అన్నదే ముఖ్యం' అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అలాగే కొలిన్ మున్రో, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియాం ప్లంకెట్‌పై కూడా శ్రేయస్ అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో సంజూ శాంసన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. సీజన్‌లో అతనికిది రెండో మ్యాచ్.

తొలి హాఫ్ సెంచరీని నమోదు చేసిన పృథ్వీ షా
కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 169 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా, శాంసన్ కూడా 18 ఏళ్ల 169 రోజుల వయసులోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. విశేషం ఏమిటంటే షా, శాంసన్ ఒక్కరోజు అటూ ఇటూ తేడా లేకుండా ఒకే వయసులో ఈ ఘనత సాధించడం. 2013లో శాంసన్ ఈ ఘనత సాధించగా, పృథ్వీ షా ఆడుతున్న రెండో ఐపీఎల్ మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications