Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి బాధలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు గట్టి షాక్.. భారీ జరిమానా!

Shreyas Iyer fined Rs 12 lakh for Delhi Capitals’ slow over rate against Sunrisers Hyderabad
IPL 2020,DC vs SRH : Shreyas Iyer Fined Rs 12 Lakh For Slow Over Rate || Oneindia Telugu

అబుదాబి: ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు గట్టి షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు కారణమైన శ్రేయస్ అయ్యర్‌పై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. అతని మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షల కోత విధించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ సమయంలో ఢిల్లీ జట్టు నిర్ణీత సమయానికి ఓవర్లను పూర్తి చేయడంలో విఫలమైంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధనల ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తిచేయకపోతే జరిమానా విధిస్తారు. ఈ సీజన్‌లో జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ తరహా ఫైన్‌కు గురయ్యాడు.

సెప్టెంబరు 24న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయలేకపోయింది. ఆ మ్యాచ్‌లో కోహ్లీసేన దారుణంగా ఓడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా తొలి సారి రూ.12 లక్షలు ఫైన్ వేశారు. రెండోసారి అదే తప్పు చేస్తే రూ.24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి చేస్తే రూ.30 లక్షల వరకు ఉంటుంది. ఇక నాలుగో సారి తప్పు చేస్తే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఐతే తుది జట్టులో మాత్రం ఉండవచ్చు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), కేన్ విలియమ్సన్(26 బంతుల్లో 5 ఫోర్లు 41) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా(2/21), అమిత్ మిశ్రా(2/35) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. శిఖర్ ధావన్(34), రిషభ్ పంత్(28), హెట్‌మైర్(21) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ మూడు వికెట్లు తీయగా.. భువీ 2, ఖలీల్, నటరాజన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

Story first published: Wednesday, September 30, 2020, 10:42 [IST]
Other articles published on Sep 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+